News August 21, 2025
పాలమూరు: గుడ్ న్యూస్.. దరఖాస్తు చేసుకోండి

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని గ్రామీణ మహిళలకు SBI, RSETI ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు ఆ సంస్థ డైరెక్టర్ జి.శ్రీనివాస్ Way2Newsతో తెలిపారు. బ్యూటి పార్లర్ కోర్సులలో ఈనెల 26 నుంచి నెల రోజులపాటు ఉచిత శిక్షణ ఉంటుందన్నారు. వయసు 19-45లోపు ఉండాలని, SSC MEMO, రేషన్, ఆధార్, కుల ధ్రువీకరణ పత్రం, ఫొటోలతో నేరుగా దరఖాస్తులు చేసుకోవాలన్నారు. వివరాలకు 98481 42489కు సంప్రదించాలన్నారు. SHARE IT
Similar News
News January 14, 2026
KNR: సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అధికారుల కొరత

కరీంనగర్ జిల్లాలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అధికారుల కొరత రిజిస్ట్రేషన్ల ప్రక్రియకు శాపంగా మారింది. రెగ్యులర్ అధికారులు లేక జూనియర్, సీనియర్ అసిస్టెంట్లు ఇన్‌ఛార్జులుగా కొనసాగుతున్నారు. తిమ్మాపూర్ వంటి చోట్ల 3 నెలల్లోనే నలుగురు అధికారులు మారడం గమనార్హం. దీంతో రిజిస్ట్రేషన్ల ప్రక్రియలో జాప్యం జరుగుతోందని, తగిన అవగాహన లేక దరఖాస్తులను తిరస్కరిస్తున్నారని క్రయవిక్రయదారులు వాపోతున్నారు.
News January 14, 2026
క్యాబినెట్ అజెండాలోకి ‘నల్లమలసాగర్’

TG: నల్లమలసాగర్ ప్రాజెక్టుపై క్యాబినెట్ సమావేశంలో చర్చించి ముందుకెళ్లాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈనెల 18న మేడారంలో జరిగే క్యాబినెట్ అజెండాలో ఈ అంశాన్ని చేర్చింది. నల్లమలసాగర్‌పై APని కట్టడిచేసేలా న్యాయపరమైన అంశాలన్నిటినీ దీనిలో చర్చించనుంది. ఇటీవల వేసిన పిటిషన్‌కు విచారణార్హత లేదని SC చెప్పడంతో TG ఉపసంహరించుకున్న సంగతి తెలిసిందే. దీంతో సివిల్ దావాను పగడ్బందీగా దాఖలు చేసేందుకు నిర్ణయించింది.
News January 14, 2026
కుంకుమాది తైలంతో చర్మ సంరక్షణ

చర్మసమస్యలను నివారించడంలో కుంకుమాది తైలం ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు. దీన్ని మాయిశ్చరైజర్, మసాజ్ క్రీమ్‌లతో కలిపి వాడుకోవచ్చు. ముడతలు, నల్ల మచ్చలు, ఫైన్ లైన్స్, పిగ్మెంటేషన్, వృద్ధాప్య సంకేతాలను తగ్గించడంలో ఇది ఉత్తమ ఫలితాలను ఇస్తుంది. మొటిమలు ఉన్నవారు దీన్ని వాడకూడదని నిపుణులు చెబుతున్నారు. బాదం, నువ్వులనూనెతో కలిపి అప్లై చేస్తే సీరంలాగా ఉపయోగపడుతుంది.


