News December 2, 2025
‘పాలమూరు ప్రాజెక్టులను గాలికొదిలేశారు’

సీఎం రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధిఉంటే పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలు పూర్తిచేసి సాగునీరు ఇవ్వాలని మాజీమంత్రి నిరంజన్ రెడ్డి డిమాండ్ చేశారు. మక్తల్ బహిరంగ సభలో సీఎం చేసిన వ్యాఖ్యలపై నిరంజన్ రెడ్డి స్పందించారు. మాటలు కోటలు దాటుతున్నాయని, రెండేళ్ల పాలనలో ఒక్క పని కూడా చేసింది లేదని విమర్శించారు. రైతులను గాలికి వదిలేసి బోనస్ అని బోగస్ మాటలతో మభ్యపెడుతున్నారని ఎద్దేవా చేశారు.
Similar News
News February 17, 2026
BREAKING: మంచిర్యాల: బాల్క సుమన్‌పై కేసు

చెన్నూర్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌పై రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. క్యాతన్‌పల్లి మున్సిపల్ ఛైర్మన్ ఎన్నిక నేపథ్యంలో పోలీసుల విధులకు ఆటంకం కలిగించడం, మంత్రి కాన్వాయ్‌పై రాళ్లతో దాడి చేశారు. కోటపల్లి ఎస్ఐ రాజశేఖర్, కానిస్టేబుల్ రాకేశ్‌కు గాయాలు అయ్యాయి. దేవాపూర్ SHO గంగారాం ఫిర్యాదు మేరకు బాల్క సుమన్‌తో పాటు మరో ఐదుగురు BRS నాయకులపై కేసు నమోదైంది.
News February 17, 2026
BREAKING: హైదరాబాదీలకు ఇందిరమ్మ ఇళ్లు

కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ(CURE) పరిధిలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక మార్చి నెలాఖరుకల్లా పూర్తిచేస్తామని మంత్రి పొంగులేటి వెల్లడించారు. ‘మురికివాడల్లో 5-10 అంతస్తుల్లో ఇళ్లు నిర్మిస్తాం. KPHB లాగా RRR- ORR మధ్య మిడిల్ క్లాస్ వారికి ఇళ్ల స్థలాల గుర్తింపు ప్రక్రియ మొదలైంది. అసంపూర్తి డబుల్ బెడ్ రూమ్‌లకు నిధులు మంజూరు చేస్తాం. సొంత స్థలం ఉన్న 28వేల మందికి ఈ నెలలో ఇళ్లు మంజూరు చేస్తాం’ అని అన్నారు.
News February 17, 2026
BREAKING: మెదక్ కలెక్టర్‌కు జైలు శిక్ష

కోర్టు ధిక్కరణ కేసులో మెదక్ కలెక్టర్ రాహుల్ రాజ్‌కు జైలు శిక్ష విధించింది. కోర్టు ఉత్తర్వులను ఉద్దేశపూర్వకంగానే ఉల్లంఘించారని పేర్కొంటూ ఆయనకు 6 నెలల జైలు శిక్షతోపాటు రూ.2 వేల జరిమానా విధించింది. తీర్పు అమలును 4 వారాలకు వాయిదా వేసిన కోర్టు.. అప్పీలు చేసుకునేందుకు కలెక్టర్‌కు గడువు ఇచ్చింది. ఓ భూవివాదం కేసులో గతంలో కోర్టు ఇచ్చిన ఆదేశాలను పట్టించుకోలేదని బోనాలకు చెందిన లక్ష్మీ హైకోర్టుకు వెళ్లింది.


