News August 20, 2025
పాలమూరు: బీఫార్మసీ ఫలితాలు విడుదల

పాలమూరు విశ్వవిద్యాలయం బీఫార్మసీ 8వ సెమిస్టర్ రెగ్యులర్, అలాగే 1, 3, 5, 7 సెమిస్టర్ల బ్యాక్ లాగ్ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. బుధవారం విశ్వవిద్యాలయం వైస్ ఛాన్స్‌లర్ ప్రొఫెసర్ జీఎన్ శ్రీనివాస్ ఈ ఫలితాలను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ రిజిస్ట్రార్ పి.రమేష్ బాబు, పరీక్షల నియంత్రణ అధికారిణి డాక్టర్ కే.ప్రవీణ, సహాయ పరీక్షల నియంత్రణ అధికారిణి డాక్టర్ శాంతి ప్రియ తదితరులు పాల్గొన్నారు.
Similar News
News January 17, 2026
బతుకమ్మ చీరలు చేలల్లో కట్టడానికే పనికొచ్చినయ్: CM

గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన బతుకమ్మ చీరలు పట్టుకునేందుకు పనికి రాలేదని చేన్లలో పందులు రాకుండా అడ్డుకునేందుకు పనికి వచ్చాయని తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని ఎంవీఎస్ కళాశాల మైదానంలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. మాజీ సీఎం కేసీఆర్ పై సీఎం సంచలన వ్యాఖ్యలు చేశారు. పది సంవత్సరాలు తెలంగాణ ప్రజలను ఆగం చేశారన్నారు.
News January 17, 2026
ఈ స్కీమ్ గురించి తెలుసా? ఆధార్ కార్డుతో రూ.90వేల లోన్

వీధి వ్యాపారులకు పెట్టుబడి సాయం అందించేందుకు కేంద్రం ‘ప్రధానమంత్రి స్వనిధి’ అనే మైక్రో క్రెడిట్ స్కీమ్‌ను అందిస్తోంది. ఎటువంటి తాకట్టు లేకుండా 3 విడతల్లో రూ.90వేల లోన్ ఇస్తారు. ఆధార్ కార్డుతో ఏదైనా ప్రభుత్వ బ్యాంకులో అప్లై చేసుకోవచ్చు. రుణాన్ని క్రమం తప్పకుండా చెల్లించే వ్యాపారులకు ఏడాదికి 7% వడ్డీ సబ్సిడీ లభిస్తుంది. 2030 మార్చి 31 వరకు ఈ పథకం అందుబాటులో ఉండనుంది.
Share It
News January 17, 2026
పాలమూరులో అన్ని ప్రాజెక్టులు పూర్తి చేస్తాం: CM

పాలమూరు గడ్డపై నిర్వహించిన బహిరంగ సభలో CM రేవంత్ రెడ్డి ఉద్వేగభరితంగా ప్రసంగించారు. గత ప్రభుత్వం ఎస్ఎల్బీసీ, నెట్టెంపాడు, పాలమూరు-రంగారెడ్డి వంటి కీలక ప్రాజెక్టులను అసంపూర్తిగా వదిలేసిందని మండిపడ్డారు. పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు, దళితులకు మూడెకరాల భూమి ఏమైందని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎంపీ డీకే అరుణతో కలిసి ప్రధాని మోదీని కలిసేందుకు తమకు అభ్యంతరం లేదని స్పష్టం చేశారు.


