News December 14, 2025

పాలమూరు: మెస్సీ మీద ఉన్న ప్రేమ BCలపై లేదు: మాజీ మంత్రి

image

రేవంత్ రెడ్డికి ఫుట్‌బాల్ ఆటగాడు మెస్సీపై ఉన్నంత ప్రేమ బీసీల మీద లేదని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బీసీ రిజర్వేషన్ల కోసం సాయి ఈశ్వర్ చారి ఆత్మహత్య చేసుకున్నా, రేవంత్ రెడ్డి వారి కుటుంబాన్ని పరామర్శించలేదన్నారు. నల్గొండ జిల్లాలో బీసీ వ్యక్తికి జరిగిన అవమానంపై విచారణ చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు.

Similar News

News January 19, 2026

సిద్దిపేట: స్వగ్రామానికి చిన్నారి మృతదేహం

image

కోహెడ మండలం బస్వాపూర్ గ్రామానికి చెందిన గుడికందుల స్నిజ్ఞ(5) భవనంపై నుంచి పడి తీవ్ర గాయాలపాలై హైదరాబాద్‌లో చికిత్స పొందుతూ ఆదివారం కన్నుమూసింది. ఆ చిన్నారిని కాపాడుకునేందుకు కుటుంబ సభ్యులు, దాతలు చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో గ్రామంలో విషాదం నెలకొంది. సోమవారం ఆసుపత్రి నుంచి చిన్నారి మృతదేహం స్వగ్రామానికి చేరుకోవడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.

News January 19, 2026

పెట్టుబడుల వేటలో సీఎంలు!

image

దావోస్ వేదికగా తెలుగు రాష్ట్రాల మధ్య పెట్టుబడుల టార్గెట్ మొదలైంది. రెండు రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు, రేవంత్, మంత్రులు వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సుకు వెళ్లారు. CBN ఒకరోజు ముందే వెళ్లి పలువురు వ్యాపారవేత్తలతో సమావేశమయ్యారు. ఇవాళ రేవంత్ కూడా తన బృందంతో వెళ్లారు. గతంలో కూడా ఇద్దరూ దావోస్ వెళ్లి పెట్టుబడుల కోసం ప్రయత్నించారు. లేటెస్ట్ పర్యటనలతో ఏ రాష్ట్రానికి ఎక్కువ పెట్టుబడులు వస్తాయనే చర్చ మొదలైంది.

News January 19, 2026

సైబర్ నేరగాళ్ల APK లింకులతో జాగ్రత్త

image

గుర్తుతెలియని వ్యక్తులు పంపే APK ఫైల్ లింక్‌లను ఎట్టి పరిస్థితుల్లోనూ క్లిక్ చేయవద్దని DIG, జిల్లా ఇన్‌ఛార్జి SP విక్రాంత్ పాటిల్ హెచ్చరించారు. ఇలాంటి ఫైళ్లు ఇన్‌స్టాల్ చేస్తే వాట్సాప్, ఫేస్‌బుక్ వంటి సామాజిక మాధ్యమాలతో పాటు బ్యాంకింగ్ యాప్‌లు కూడా హ్యాక్ అయ్యే ప్రమాదముందని వివరించారు. ఫోన్ హ్యాక్ అయినట్లు అనుమానం వస్తే వెంటనే ఫ్లైట్ మోడ్‌లో పెట్టి సైబర్ ల్యాబ్ పోలీసులను సంప్రదించాలని సూచించారు.