News May 7, 2025
పాలమూరు యూనివర్సిటీలో పరీక్షలు వాయిదా..!

పాలమూరు యూనివర్సిటీ పరిధిలోని UG 2,4,6 సెమిస్టర్ రెగ్యులర్, 5 సెమిస్టర్ బ్యాక్ లాగ్ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు యూనివర్సిటీ శుక్రవారం సర్క్యులర్ జారీ చేసింది. PU పరిధిలోని MBNR, WNPT, GDWL, NGKL, NRPTలోని ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు అభ్యర్థన మేరకు పరీక్షలు వాయిదా వేస్తున్నట్లు తెలిపింది. పరీక్షల తేదీలను త్వరలోనే ప్రకటిస్తామని పేర్కొంది. వివరాలకు www.palamuruuniversity.com వెబ్‌సైట్ చూడండి.
Similar News
News February 17, 2026
₹28వేల కోట్లతో VER… 9 జిల్లాలకు మహర్దశ

AP: NITI ఆయోగ్ ప్రతిపాదించిన ‘విశాఖ ఎకనమిక్ రీజియన్’ అవకాశాన్ని అందిపుచ్చుకొనేలా GOVT అడుగులు వేస్తోంది. ₹28000 CRతో చేపట్టే ఈ ప్రాజెక్టు ఉత్తరాంధ్ర సహా కోస్తా రూపురేఖలు మార్చనుంది. ఈ నిధుల గురించి రాష్ట్ర బడ్జెట్లో పొందుపరిచారు. కేంద్ర, ప్రైవేటు పెట్టుబడులతో 20L ఉద్యోగాలు వస్తాయని అంచనా. VSP, మన్యం, శ్రీకాకుళం, అల్లూరి, అనకాపల్లి, తూ.గో, కోనసీమ, కాకినాడ, పోలవరం జిల్లాలు దీని పరిధిలోకి వస్తాయి.
News February 17, 2026
TODAY HEADLINES

* AIపై చర్చకు ప్రపంచాన్ని ఏకం చేస్తున్నాం: PM
* టెక్నాలజీతో పౌర సేవకు బిల్‌గేట్సే ప్రేరణ: CBN
* చంద్రబాబువి విజనరీ ఆలోచనలు: బిల్ గేట్స్
* మార్చి 3న శ్రీవారి ఆలయం మూసివేత
* బడ్జెట్ సెషన్ రెండో దశలో అమరావతి బిల్లు?
* TG: కాంగ్రెస్ ఖాతాలోకి 82 ఛైర్మన్, 5 మేయర్ పోస్టులు
*TG: సన్నాలకు బోనస్.. రూ.514.36 కోట్లు విడుదల
* JEE ఫలితాలు.. ముగ్గురు తెలుగువారికి 100 పర్సంటైల్
News February 17, 2026
HYD: ఆఫీసే నయం.. ఇంటికి వెళ్లాలంటేనే భయం!

‘బాస్ పిలుస్తాడని కాదు.. ఇంటికెళ్తే వచ్చే తలనొప్పి భరించలేక’ ఇదీ నేటి యూత్ మైండ్‌సెట్. ఆఫీసు పని ఒత్తిడి, టార్గెట్ ఒక ఎత్తైతే, ఇంటికి వెళ్లాక ల్యాప్‌టాప్ వదలని ‘ఆల్వేస్ అవైలబుల్’ కల్చర్ యువతను నిలువునా దహించేస్తోంది. అందుకే ఇంటికెళ్లి ఆ గందరగోళంలో పడేకంటే, ఆఫీసులోనే కాసేపు ఎక్కువ గడిపి ఆ ప్రశాంతతను వెతుక్కుంటున్నారు. పని నుంచి తప్పించుకోవడానికి కాదు, మానసిక ప్రశాంతత కోసమే ఈ లేట్ నైట్ తిప్పలు!


