News September 24, 2024
పాలమూరు- రంగారెడ్డి పథకాన్ని పూర్తి చేయాలి: మాజీ మంత్రి
ప్రభుత్వం పంతాలు, పట్టింపులకు పోకుండా పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని వెంటనే పూర్తి చేయాలని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ విజ్ఞప్తి చేశారు. హైదరాబాదులోని తెలంగాణ భవన్ లో మంగళవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. 90 శాతం పనులు కేసీఆర్ హయాంలోని పూర్తి చేయడం జరిగిందని గుర్తు చేశారు. వలసల జిల్లా అయిన పాలమూరు పచ్చబడే విధంగా చేసిన ఘనత కేసిఆర్ కే దక్కుతుందని అన్నారు.
Similar News
News October 13, 2024
సొంతూరిలో రేవంత్ రెడ్డికి బ్రహ్మరథం
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తన సొంత గ్రామం కొండారెడ్డిపల్లిలో విజయదశమి సందర్భంగా శనివారం సాయంత్రం పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన ప్రజలు సీఎం రేవంత్ రెడ్డికి బ్రహ్మరథం పట్టారు. గ్రామంలో ఉన్న ప్రజలందరూ ఒకేసారి రోడ్డుపైకి వచ్చి బోనాలతో పాటు తదితర సాంస్కృతిక కార్యక్రమాలతో ఆయనకు స్వాగతం పలికారు. దీంతో సీఎం ఆనందంతో ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు.
News October 12, 2024
ఉమ్మడి పాలమూరు జిల్లా నేటి ముఖ్యాంశాలు
✓ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఘనంగా విజయదశమి వేడుకలు.
✓ అలంపూర్: కన్నుల పండుగగా తెప్పోత్సవం.
✓ అలంపూర్: జోగులాంబను దర్శించుకున్న డీజీపీ జితేందర్.
✓ కొండారెడ్డిపల్లిలో అభివృద్ధి పనులను ప్రారంభించి దసరా వేడుకల్లో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి.
✓ కల్వకుర్తి: ఉప్పొంగిన దుందుభి వాగు రాకపోకలు బంద్.
✓ రేపు కోడంగల్ రానున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.
✓ ఉమ్మడి జిల్లాలో ఘనంగా బతుకమ్మ, దేవి నవరాత్రి ఉత్సవాలు.
News October 12, 2024
MBNR: కుంటలో పడి అన్నదమ్ములు మృతి
దసరా వేళ మహబూబ్‌నగర్ జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. నీట మునిగి అన్నదమ్ములు మృతిచెందారు. స్థానికులు తెలిపిన వివరాలు.. మూసాపేట మండలం స్ఫూర్తి తండాకు చెందిన సక్రు నాయక్ పిల్లలు సాయి(12), సాకేత్(10). సాయి చక్రాపూర్ గ్రామంలో, సాకేత్ MBNRలో చదువుతుండగా దసరా సెలవులకు ఊరికొచ్చారు. ఇవాళ సాయంత్రం ఇంటి సమీపంలో ఉన్న నీటి కుంటలో పడి మృతిచెందారు. స్థానికులు గమనించి కుంట నుంచి మృతదేహాలను బయటకు తీశారు.