News November 30, 2025

పాలమూరు: రైలు నుంచి జారిపడి యువకుడి మృతి

image

రైలు నుండి జారిపడి గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందిన ఘటన జడ్చర్ల సమీపంలోని ఆలూరు రైల్వే గేట్ వద్ద ఆదివారం చోటుచేసుకుంది. రైల్వే ఎస్సై అక్బర్ తెలిపిన వివరాలు.. యువకుడి 25-30 ఏళ్లు ఉంటుందన్నారు. యువకుడు నలుపు రంగు షర్టు, బ్లూ కలర్ జీన్స్ ప్యాంటు ధరించాడు. చేతిపై “ఓం”అని పచ్చబొట్టు ఉందన్నారు. యువకుడిని ఎవరైనా గుర్తిస్తే 87126 58597 నంబర్ సంప్రదించాలన్నారు.

Similar News

News February 16, 2026

విశాఖ: ప్రైవేట్ పాఠశాలల్లో ఉచిత ప్రవేశాలు.. లాస్ట్ డేట్ ఎప్పుడంటే

image

విద్యాహక్కు చట్టం(RTE) ప్రకారం ప్రైవేట్ స్కూళ్లలో ఒకటో తరగతిలో 25% ఉచిత సీట్ల భర్తీకి ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఐదేళ్లు నిండిన పేద విద్యార్థులు మార్చి 10 లోపు దరఖాస్తు చేసుకోవాలని ఏపీ ఆర్టీఈ ఫోరమ్ స్టేట్ కన్వీనర్ నరవ ప్రకాశ రావు తెలిపారు. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1800 425 8599 సంప్రదించాలన్నారు.

News February 16, 2026

ఆదిలాబాద్‌ మున్సిపల్ ఛైర్‌పర్సన్‌గా బండారి అనూష

image

ఆదిలాబాద్‌ మున్సిపాలిటీలో నెలకొన్న రాజకీయ ఉత్కంఠకు తెరపడింది. ఛైర్‌పర్సన్‌గా 45వ వార్డు స్వతంత్ర అభ్యర్థి బండారి అనూష ఎన్నికయ్యారు. అధికారుల ఆధ్వర్యంలో కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారం అనంతరం నిర్వహించిన ఎన్నికలో ఆమెకు 27 మంది సభ్యులు మద్దతుగా నిలిచారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలతో పాటు ఇతర స్వతంత్ర సభ్యులు అనూషకు మద్దతు తెలిపారు.

News February 16, 2026

సూర్యాపేట మున్సిపల్ ఛైర్ పర్సన్‌గా నివేదిత

image

సూర్యాపేట మున్సిపల్ ఛైర్ పర్సన్ మొరిశెట్టి నివేదిత, వైస్ ఛైర్మన్‌గా మహమ్మద్ షఫీ ఉల్లా ఎన్నికయ్యారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన 31 మంది కౌన్సిలర్లతో పాటు ముగ్గురు స్వతంత్రులు మద్దతు తెలపడంతో వీరి ఎన్నిక ఏకగ్రీవమైంది. మంత్రి ఉత్తమ్ నాయకత్వంలో పట్టణ అభివృద్ధికి కట్టుబడి ఉంటామని నూతన పాలకవర్గం ప్రకటించింది.