News October 5, 2025

పాలమూరు: SSC, INTER.. రేపు లాస్ట్

image

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో ఉన్న విద్యార్థులు ఓపెన్ SSC, INTERలో ప్రవేశాలకు రేపే చివరి తేదీని ఉమ్మడి జిల్లా ఓపెన్ స్కూల్ కో-ఆర్డినేటర్ శివయ్య Way2Newsతో తెలిపారు. ఈనెల 6లోగా (ఫైన్ లేకుండా) www.telanganaopenschool.org వెబ్‌సైట్‌లో దరఖాస్తులు చేసుకోవాలని, అడ్మిషన్ అయిన వారికి ఉచిత పుస్తకాలు, తరగతులు నిర్వహిస్తామని, ఆసక్తి గలవారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. SHARE IT.

Similar News

News January 20, 2026

MBNR: సీఎం రేవంత్ రెడ్డిపై అడిషనల్ ఎస్పీకి ఫిర్యాదు

image

రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డిపై MBNR జిల్లా అదనపు ఎస్పీకి మాజీ గ్రంథాలయ ఛైర్మన్ రాజేశ్వర్ గౌడ్, మాజీ జెడ్పీ వైస్ ఛైర్మన్ యాదయ్య మంగళవారం ఫిర్యాదు చేశారు. ఈనెల 18న ఖమ్మంలో జరిగిన మహాసభలో రాష్ట్ర సీఎం బీఆర్ఎస్ నాయకులను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని, సీఎం హోదాలో ఉండి ఈ విధంగా చేసిన ఆయనపై కేసు నమోదు చేయాలని ఫిర్యాదు చేశారు. వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు.

News January 20, 2026

మహబూబ్‌నగర్‌లో అగ్నిప్రమాదం

image

మహబూబ్‌నగర్ పట్టణంలోని పారిశ్రామిక వాడలో గల ఓ బెడ్ వర్క్స్‌లో మంగళవారం మధ్యాహ్నం ప్రమాదవశాత్తు నిప్పు అంటుకుంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను అదుపు చేశారు. పక్కనే గ్యాస్ సిలిండర్ల గోదాం ఉండటంతో ప్రమాద ముప్పు పొంచి ఉందని, ఆ బెడ్ వర్క్స్‌ను అక్కడి నుంచి తరలించాలని స్థానికులు కోరుతున్నారు.

News January 20, 2026

జిల్లాలో చలి పంజా.. రాజాపూర్‌లో 11.8 డిగ్రీలు

image

ఉమ్మడి జిల్లాలో చలి తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. గత 24 గంటల్లో రాజాపూర్‌ మండలంలో అత్యల్పంగా 11.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. జడ్చర్లలో 12.1, కొత్తపల్లిలో 13.1 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పెరిగిన చలితో రాత్రివేళల్లో జనం ఇబ్బందులు పడుతున్నారు. రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత తగ్గే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.