News July 28, 2024
పాల్వంచలో బెట్టింగ్ వల్ల యువకుడి సూసైడ్
పాల్వంచ మండలం జగన్నాథపురం సమీపంలో నిన్న ఓ యువకుడు ప్రవీణ్(21) ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. కాగా యువకుడి ఆత్మహత్యకు గల కారణాలు ఆదివారం వెలుగులోకి వచ్చాయి. బెట్టింగ్ యాప్‌లో రూ.70 వేలు పోగొట్టుకోవడంతో తల్లిదండ్రులకు ఏం చెప్పాలో తెలియక, భయంతో ఆత్మహత్య చేసుకున్నాడని స్థానికులు తెలిపారు. యువకుడి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
Similar News
News October 7, 2024
ఖమ్మం: నంబర్ ప్లేట్ లేకుండా వాహనాలు నడిపితే కేసులు: ట్రాఫిక్ ఏసీపీ
ఖమ్మంలో ఉద్దేశపూర్వకంగా నంబర్ ప్లేట్ లేకుండా వాహనాలు నడిపితే కేసులు నమోదు చేస్తామని ట్రాఫిక్ ACP శ్రీనివాసులు తెలిపారు. పోలీస్ కమిషనర్ ఆదేశాలతో వాహన తనిఖీల్లో భాగంగా నంబర్ ప్లేట్ లేని 55 బైకులను ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌కు తరలించినట్లు చెప్పారు. ప్రస్తుతం పట్టుబడిన వాహన పత్రాలు, ఛాసిస్ నంబర్లు తనిఖీ చేస్తూ చోరికి గురైన వాహనాలు ఏమైనా ఉన్నాయో లేదో పరిశీలిస్తునట్లు పేర్కొన్నారు.
News October 7, 2024
రేపు ఖమ్మం నగరంలో డిప్యూటీ సీఎం పర్యటన
ఖమ్మం నగరంలో మంగళవారం డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పర్యటించనున్నట్లు స్థానిక కాంగ్రెస్ నేతలు ఓ ప్రకటనలో తెలిపారు. ముందుగా డిప్యూటీ సీఎం జిల్లా కలెక్టరేట్‌లో సోషల్ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్, ఉమ్మడి ఖమ్మం, ఉమ్మడి వరంగల్ జిల్లాల ఎంపీడీసీఎల్ అధికారులతో సమీక్ష నిర్వహిస్తారని చెప్పారు. తదనంతరం డిప్యూటీ సీఎం బతుకమ్మ వేడుకల్లో పాల్గొంటారని పేర్కొన్నారు.
News October 7, 2024
దుర్గమ్మకు ప్రత్యేక పూజలు చేసిన ముస్లిం దంపతులు
ఖమ్మం రూరల్: నాయుడుపేటలో ఏర్పాటుచేసిన శ్రీ కనకదుర్గ అమ్మవారిని ముస్లిం దంపతులు షేక్ సోందు- నైదాభి దర్శించుకున్నారు. అమ్మవారికి ముస్లిం దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలను స్వీకరించారు. హిందూ దేవత అయిన దుర్గమ్మకు పూజలు నిర్వహించిన ముస్లిం దంపతులు ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నారని స్థానికులు తెలిపారు. కాగా షేక్ సొందు ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్నారు.