News May 2, 2024

పాల్వంచలో వడదెబ్బతో వృద్ధురాలు మృతి

image

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా భానుడు భగభగమంటున్నాడు. పాల్వంచ మండల పరిధిలోని జగన్నాథపురం గ్రామానికి చెందిన వృద్ధురాలు తోట భూ లక్ష్మి గురువారం వడదెబ్బతో మృతి చెందింది. ఎండల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. ఎండ అధికంగా ఉడడంతో ఎవరు దూర ప్రయాణాలు చేయవద్దని, చిన్న పిల్లలని బయట తిప్పవద్దని వైద్యులు కోరుతున్నారు.

Similar News

News December 10, 2025

‘పోలింగ్ రోజున వేతనముతో కూడిన సెలవు’

image

గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా జిల్లా కార్మిక శాఖ డిప్యూటీ లేబర్ కమిషనర్ విజయభాస్కర్ రెడ్డి మంగళవారం కీలక ప్రకటన విడుదల చేశారు. SEC, జిల్లా కలెక్టర్ అనుదీప్ ఆదేశాల మేరకు ఎన్నికలు జరుగుతున్న పంచాయతీ పరిధిలోని ప్రభుత్వ, ప్రయివేట్ ఆఫీసులు, షాపులు, వాణిజ్య సంస్థలు, ఇతర పరిశ్రమల యజమానులు తమ ఉద్యోగులకు సెలవు ఇవ్వాలని ఆదేశించారు. ఓటు హక్కు వినియోగించుకున్న ఉద్యోగులకు ఏ విధంగానూ జీతం కట్ చేయవద్దన్నారు.

News December 9, 2025

ఖమ్మం: పోలింగ్ సిబ్బంది 3వ దశ ర్యాండమైజేషన్ పూర్తి

image

జిల్లాలో తొలి దశ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి పోలింగ్ సిబ్బంది మూడవ దశ ర్యాండమైజేషన్ ప్రక్రియను ఎన్నికల పరిశీలకులు ఖర్తడే కాళీచరణ్ సుదామా రావు, కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఆధ్వర్యంలో మంగళవారం పూర్తి చేశారు. 192 గ్రామ పంచాయతీలు, 1,740 వార్డులకు గాను 1,582 బృందాలను ఏర్పాటు చేసి, 20 మంది సిబ్బందిని రిజర్వ్‌లో ఉంచారు. 1,899 పోలింగ్ అధికారులు, 2,321 ఓపీలను మండలాలవారీగా కేంద్రాలకు కేటాయించారు.