News November 30, 2025
పాల్వంచ: నామినేషన్ కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్

ఎన్నికల సందర్భంగా కోడిపుంజుల వాగు పంచాయతీలో నిర్వహిస్తున్న నామినేషన్ల స్వీకరణ కేంద్రాన్ని కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఆదివారం తనిఖీ చేశారు. సర్పంచ్, వార్డు స్థానాల నోటిఫికేషన్ వివరాలను ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు. ఎలాంటి తప్పిదాలు లేకుండా పారదర్శకంగా ఎన్నికల ప్రక్రియను నిర్వహించాలని సిబ్బందిని ఆదేశించారు. నామినేషన్ సెంటర్ వద్ద హెల్ప్ డెస్క్ తప్పనిసరిగా ఉంచి, అభ్యర్థులకు సూచనలు ఇవ్వాలని సూచించారు.
Similar News
News February 13, 2026
ఏలూరు: హత్య కేసులో జీవిత ఖైదు

దెందులూరు మండలం గాలాయగూడెంలో జరిగిన వ్యక్తి హత్య కేసులో నిందితుడు పాలడుగుల దుర్గాప్రసాద్‌కు జీవిత ఖైదుతో పాటు వెయ్యి రూపాయల జరిమానా విధిస్తూ 5వ అదనపు జిల్లా సెషన్స్ న్యాయమూర్తి మురళీకృష్ణ శుక్రవారం తీర్పునిచ్చారు. 2022లో నమోదైన ఈ కేసులో నేరం రుజువు కావడంతో న్యాయస్థానం ఈ శిక్ష ఖరారు చేసినట్లు దెందులూరు ఎస్సై శివాజీ వెల్లడించారు.
News February 13, 2026
GWL: మున్సిపల్ ఫలితాల్లో బీఆర్ఎస్ హవా..!

గద్వాల జిల్లాలో అలంపూర్, అయిజ, వడ్డేపల్లి, గద్వాల మున్సిపాలిటీలు ఉండగా మొత్తం 77 వార్డులు ఉన్నాయి. ఈనెల 11న ఆయా మున్సిపాలిటీల్లో ఎన్నికలు జరిగాయి. శుక్రవారం అధికారులు ఫలితాలు వెల్లడించారు. బీజేపీ 7 వార్డులు, కాంగ్రెస్ 29 వార్డులు, బీఆర్ఎస్ 30 వార్డులు, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ 8 వార్డులు ఇండిపెండెంట్లు రెండు వార్డుల్లో గెలుపొందారు. ఒక స్థానం ఆధిక్యంతో బీఆర్ఎస్ ముందు వరసలో నిలిచింది.
News February 13, 2026
ఆర్మీలో అగ్నివీర్ పోస్టులు.. నేటి నుంచి దరఖాస్తుల ఆహ్వానం

ఇండియన్ ఆర్మీ అగ్నిపథ్ స్కీం కింద అగ్నివీర్(GD, టెక్నికల్, ట్రేడ్స్‌మెన్, క్లర్క్, స్టోర్ కీపర్ టెక్నికల్, ఉమెన్ మిలిటరీ పోలీస్) పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. టెన్త్, ITI, డిప్లొమా అర్హతతో పాటు శారీరక ప్రమాణాలు కలిగిన అభ్యర్థులు నేటి నుంచి ఏప్రిల్ 1 వరకు అప్లై చేసుకోవచ్చు. వయసు 17.5 – 22 ఏళ్ల మధ్య ఉండాలి. రాత పరీక్ష జూన్ 1 నుంచి జూన్ 15 వరకు నిర్వహిస్తారు. సైట్: https://joinindianarmy.nic.in


