News March 6, 2025
పాల్వంచ: లైంగికంగా వేధిస్తున్నాడని ఫిర్యాదు

పాల్వంచ టౌన్ శ్రీ నిలయం అపార్ట్మెంట్‌లో సునీల్ అనే వ్యక్తి తన సెల్ ఫోన్లో మహిళల ఫొటోలు తీస్తూ లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడని వాచ్మెన్ & లాండ్రీ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు నంద్యాల వెంకటేశ్వర్లు అన్నారు. అపార్ట్మెంట్లో మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడని అతనిపై చర్యలు తీసుకోవాలని యాజమాన్యానికి గురువారం ఫిర్యాదు చేశారు. ఓ వాచ్మెన్ భార్యతో కూడా ఇలాగే వ్యవహరించాడని వారు తెలిపారు.
Similar News
News December 11, 2025
విజయవాడలో జాతీయ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ టోర్నమెంటు

AP: యోనెక్స్- సన్‌రైజ్ 87వ సీనియర్ నేషనల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్-2025 టోర్నమెంటు ఈనెల 24-28 తేదీల్లో విజయవాడలో జరగనుంది. ఇందుకు సంబంధించిన పోస్టర్‌ను CM CBN ఆవిష్కరించారు. ఏపీలో పదేళ్ల తర్వాత ఈ ఛాంపియన్‌షిప్ పోటీలు నిర్వహిస్తున్నామని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, శాప్ ఛైర్మన్ రవి నాయుడు తెలిపారు. ఈ టోర్నమెంటును ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించాలని సీఎం వారికి సూచించారు.
News December 11, 2025
సిద్దిపేట: రేపు సాయంత్రం వరకే ప్రచారం: కలెక్టర్

రేపు సాయంత్రం 5 గంటల వరకే రెండో విడత పంచాయతీ ఎన్నికల ప్రచారానికి అనుమతి ఉందని కలెక్టర్ హైమావతి తెలిపారు. జీపీ ఎన్నికల్లో భాగంగా జిల్లాలో 2వ విడత ఎన్నికల పోలింగ్ ఈనెల 14న నిర్వహించనున్నారు. 2వ విడత ఎన్నికలు జరగనున్న అక్బర్పేట భూంపల్లి, బెజ్జంకి, చిన్నకోడూర్, దుబ్బాక, మిరుదొడ్డి, నంగునూరు, నారాయణరావుపేట, సిద్దిపేట రూరల్, అర్బన్, తొగుట మండలాలల్లో 5 గంటలకు ప్రచారం పూర్తి చేయాలన్నారు.
News December 11, 2025
వనపర్తి: విజయోత్సవ ర్యాలీలు నిషేధం: ఎస్పీ

మూడు దశల పంచాయతీ ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ (MCC) అమల్లో ఉంటుందని ఎస్పీ సునీతారెడ్డి తెలిపారు. ఎన్నికల ఫలితాలు వచ్చినప్పటికీ, ర్యాలీలు, బైక్ శోభాయాత్రలు పూర్తిగా నిషేధమని, నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని ఆమె హెచ్చరించారు. శాంతియుత వాతావరణం కోసం ప్రతి పౌరుడు సహకరించాలని కోరారు.


