News November 16, 2025

పింగిళి కళాశాలలో పీజీ కోర్సులకు స్పాట్ అడ్మిషన్లు

image

HNK వడ్డేపల్లిలోని ప్రభుత్వ పింగిళి మహిళా డిగ్రీ- పీజీ కళాశాలలో పీజీ కోర్సుల్లో మిగిలిన సీట్లకు ఈ నెల 19న ఉదయం 10 గంటలకు స్పాట్ అడ్మిషన్లు నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ బి. చంద్రమౌళి తెలిపారు. ఎంఏ (తెలుగు, ఇంగ్లీష్), ఎమ్మెస్సీ (జువాలజీ, బాటనీ, కంప్యూటర్ సైన్స్) వంటి కోర్సులకు అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరుకావాలని ఆయన సూచించారు. సీపీజీఈటీ-2025 అర్హత తప్పనిసరి అని చెప్పారు.

Similar News

News January 14, 2026

GNT: కిటకిటలాడుతున్న సరస్ ప్రదర్శన ప్రాంగణం

image

గుంటూరులో జరుగుతున్న సరస్ మేళా-2026 అఖిల భారత డ్వాక్రా బజారుకు విశేమైన ఆదరణ లభిస్తోంది. సంక్రాంతి సెలవుల నేపథ్యంలో ప్రతిరోజూ వేల సంఖ్యలో సందర్శకులు స్టాళ్లను సందర్శిస్తున్నారు. దేశ నలుమూలల నుంచి వచ్చిన స్టాల్స్ మాత్రమే కాకుండా సందర్శకుల కోసం సాంస్కృతిక కార్యక్రమాల ప్రదర్శనలు కూడా జరుగుతున్నాయి. ఉత్పత్తులతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు ఆలరిస్తున్నాయని సందర్శకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

News January 14, 2026

చిత్తూరుకు వెళ్లి వస్తుండగా ప్రమాదం.. మహిళ స్పాట్ డెడ్

image

తవణంపల్లి: తెల్లగుండ్లపల్లి ఫ్లైఓవర్ వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కర్ణం వందలూరు గ్రామానికి చెందిన కే. బుజ్జమ్మ (45) భర్త మురుగయ్య‌తో కలిసి బైకుపై చిత్తూరుకు వెళ్లి వస్తుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో బుజ్జమ్మ అక్కడికక్కడే మృతి చెందగా, మురుగయ్యకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన మురుగయ్యను చికిత్స నిమిత్తం వేలూరు సీఎంసీ ఆసుపత్రికి తరలించారు.

News January 14, 2026

తాండూర్: స్కూల్‌కు వెళ్లమన్నందుకు సూసైడ్

image

తాండూర్ మండలం నీలాయపల్లిలోని వడ్డెర కాలనీ చెందిన రుద్ర హనీతేజ (15) చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి మృతి చెందినట్లు మాదారం ఎస్ఐ సౌజన్య తెలిపారు. హనీ తేజ తంగళ్లపల్లి ZPSSలో టెన్త్ చదువుతున్నాడు. డిసెంబర్ 21న స్కూలుకు వెళ్లమని తల్లి మందలించగా ఇంట్లో గడ్డి మందు తాగాడు. హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఎస్ఐ వెల్లడించారు.