News December 1, 2025
పింఛన్లు పంపిణీలో జాప్యం చేస్తే చర్యలు: కలెక్టర్

పింఛన్లు పంపిణీలో జాప్యం చేయొద్దని కలెక్టర్ దినేష్ కుమార్ అన్నారు. సోమవారం రంపచోడవరం ఎస్టీ కాలనీలో పింఛన్ల సొమ్ములను కలెక్టర్ లబ్ధిదారులకు అందించారు. నగదు ఇవ్వకుండా నిర్లక్ష్యం చేస్తే వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మంగా బొజ్జయ్య, సబ్ కలెక్టర్ శుభం నొక్వాల్, సచివాలయం ఉద్యోగులు పాల్గొన్నారు.
Similar News
News February 18, 2026
HYDలో కొత్త ట్రెండ్.. డిజిటల్ ‘Raw’నెస్

కలర్ ఫుల్ ఫిల్టర్ల కాలం చెల్లింది. ఇప్పుడు అంతా పక్కా లోకల్. గూగుల్ సెర్చ్‌కి టాటా చెప్పేసి GEN Z ఇన్‌స్టా రీల్స్‌లోనే బిర్యానీ అడ్రస్‌లు వెతుకుతున్నారు. ఎడిటింగ్ హడావిడి లేని అచ్చమైన ‘డిజిటల్ రానెస్’ వీడియోలకే ఇప్పుడు కిరాక్ రెస్పాన్స్. షో-ఆఫ్ కంటే కళ్ల ముందు కనిపించే నిజాయతీకే జనం ఫిదా అవుతున్నారు. గల్లీలో తీసిన అసలైన ఎమోషన్‌కే లైకులు, షేర్ల వర్షం కురుస్తోంది. ఈ కొత్త ట్రెండ్‌పై మీరేమంటారు?
News February 18, 2026
నెల్లూరులో కనిపించిన నెలవంక.. టైమింగ్స్ ఇవే

నెల్లూరు జిల్లాలో నెలవంక కనిపించడంతో రంజాన్ మాసం మొదలైంది. చిన్నాపెద్ద తేడా లేకుండా కఠోర ఉపవాస దీక్షలకు ముస్లిం సోదరులు సిద్ధమయ్యారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉపవాసంలో ఉంటారు. తర్వాత ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. గురువారం సమయాలు ఇలా ఉన్నాయి.
సహరి: ఉదయం 5.12గంటలకు
ఇప్తార్: సాయంత్రం 6:16 గంటలకు
News February 18, 2026
NZB: కనిపించిన నెలవంక.. మోగిన రంజాన్ సైరన్

ముస్లింల అత్యంత పవిత్రమైన రంజాన్ మాసం నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల వ్యాప్తంగా ఆధ్యాత్మిక సందడితో ప్రారంభమైంది. బుధవారం సాయంత్రం ఆకాశంలో నెలవంక దర్శనమివ్వగానే జిల్లాలోని అన్ని మసీదుల్లో సైరన్ మోగించి భక్తులకు సమాచారాన్ని అందించారు. రంజాన్ మాసం దృష్ట్యా జిల్లాల్లోని అన్ని మసీదులను విద్యుత్ దీపాలతో సుందరంగా అలంకరించారు. ప్రార్థనలకు వచ్చే భక్తుల కోసం ప్రత్యేక సౌకర్యాలు కల్పించారు.


