News September 10, 2025
పిట్లం: తండ్రి అంత్యక్రియలకు వచ్చి కొడుకు మృతి

పిట్లం మండలం ధర్మారంలో విషాదం జరిగింది. స్థానికుల వివరాలు.. గ్రామానికి చెందిన ఒడ్డే నాగయ్య మంగళవారం రాత్రి అనారోగ్యంతో మరణించారు. దీంతో ఆయన కొడుకు ప్రకాష్(36) తండ్రి అంత్యక్రియల కోసం బుధవారం HYD నుంచి గ్రామానికి వచ్చాడు. అంత్యక్రియల ఏర్పాట్లు జరుగుతుండగా ప్రకాష్ ఇంట్లో అనుమానాస్పదస్థితిలో చనిపోయి కనిపించాడు. ప్రకాష్ మరణంపై అనుమానం ఉందని, మృతుని తమ్ముడు బుచ్చయ్య పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
Similar News
News December 15, 2025
పాడి పశువులకు టీకాలు – తీసుకోవాల్సిన జాగ్రత్తలు

వాతావరణ మార్పుల కారణంగా పశువులకు కొన్ని బాక్టీరియా రోగాలు వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే పశువులకు ఆయా సీజన్లకు అనుగుణంగా టీకాలు వేయించాలి. ఆ సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ☛ వాతావరణం చల్లగా ఉన్నప్పుడు(ఉదయం, సాయంత్రం) మాత్రమే టీకాలు వేయించాలి. ☛ వ్యాధి సోకిన పశువులకు ఎట్టి పరిస్థితుల్లోనూ టీకాలు వేయించకూడదు. ☛ ఒక టీకా వేసిన 10-15 రోజుల తర్వాత మాత్రమే ఇంకో టీకా వేయించాలి.
News December 15, 2025
NTR: ఆలయ సేవలు ఇక వాట్సాప్‌లో

ఆలయాలకు సంబంధించిన సేవలను సైతం వాట్సాప్ ద్వారా నమోదు చేసుకునే అవకాశం ప్రభుత్వం కల్పించింది. వాట్సాప్‌లో 9552300009కి hi అని మెసేజ్ పంపి.. దర్శన్ టికెట్లు, ప్రత్యేక పూజలు, రూమ్స్ బుకింగ్ వంటి పలు రకాల టికెట్లను నేరుగా ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవచ్చు. ప్రస్తుతం దుర్గమ్మ ఆలయంతో పాటు, మరో 21 ఆలయాల్లో ఈ సదుపాయం కల్పించారు.
News December 15, 2025
ధనుర్మాసం ఎందుకంత ప్రత్యేకం?

సూర్యుడు ధనురాశిలో సంచరించే కాలాన్ని ధనుర్మాసం అంటారు. ఇది ఉత్తరాయణం ప్రారంభానికి ముందు వచ్చే పరమ పవిత్రమైన సంధికాలం. ఇది దేవతలకు రాత్రి చివరి భాగం వంటిది. ఈ మాసంలో సత్త్వగుణం వృద్ధి చెందుతుంది. భగవద్గీతలో శ్రీకృష్ణుడు ‘మాసానాం మార్గశీర్షోహం’ అని చెప్పాడు. ఆధ్యాత్మిక, భౌతిక ఫలాలను పొందడానికి, దైవారాధన చేయడానికి, దానధర్మాలు ఆచరించడానికి ఈ మాసం అత్యంత అనుకూలమైనది.


