News December 2, 2025

పిల్లలను బేబీ వాకర్‌తో నడిపిస్తున్నారా?

image

పిల్లలు త్వరగా నడవాలని చాలామంది పేరెంట్స్ బేబీ వాకర్‌లో ఎక్కువసేపు కూర్చోబెడతారు. కానీ దీనివల్ల నష్టాలే ఎక్కువంటున్నారు నిపుణులు. ఎక్కువగా బేబీవాకర్‌లో ఉండటం వల్ల చిన్నారుల వెన్నెముక వంకరగా మారుతుందని చెబుతున్నారు. అలాగే దీనివల్ల కాళ్లు దూరంగా పెట్టి నడవడం అలవాటవుతుంది. బిడ్డ తనంతట తానుగా లేచి నడిస్తే మంచి సమతుల్యత ఉంటుంది. కాబట్టి వాకర్స్‌ వాడటం మంచిది కాదని సూచిస్తున్నారు.

Similar News

News February 18, 2026

Lupus: మీలో ఈ లక్షణాలు ఉన్నాయా?

image

కొందరిలో రోగనిరోధక వ్యవస్థ గాడితప్పి హానికారకాలకు, ఆరోగ్య కణజాలానికి మధ్య తేడాను గుర్తించలేదు. దీంతో యాంటీబాడీలు మన శరీర కణజాలం మీదే దాడి చేస్తాయి. దీన్నే లూపస్ అంటారు. ఇదొక ఆటోఇమ్యూన్ డిసీజ్. లూపస్‌తో బాధపడేవారు చూడటానికి ఆరోగ్యంగానే కనిపిస్తారు. నిస్సత్తువ, జ్వరం, నోట్లో పుండ్లు వంటి లక్షణాలు ఉంటాయి. కానీ జబ్బు నిర్ధరణ అయ్యేసరికే గుండె, ఊపిరితిత్తులు, కిడ్నీ వంటి అవయవాలు దెబ్బతింటాయి.

News February 18, 2026

Lupus: ఈ సమస్య ఆడవారిలోనే ఎక్కువ

image

లూపస్‌ వ్యాధి బాధితుల్లో 90% మంది మహిళలే. సంతానోత్పత్తి సమయంలో దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. స్త్రీ హార్మోన్లు చురుకుగా ఉండటమే దీనికి కారణమని పరిశోధకులు భావిస్తున్నారు. దీన్ని నిర్ధారించడానికి న్యూక్లియర్‌ యాంటీబాడీ, డబుల్‌స్ట్రాండ్‌ DNA, రక్తంలో C3, C4 ప్రొటీన్లు.. యాంటీఫాస్ఫోలిపిడ్‌ యాంటీబాడీ పరీక్షలు చేస్తారు. ఫలితాలను బట్టి చికిత్స ఉంటుంది. క్రమంతప్పకుండా మందులు వాడితే ఏ ప్రమాదం ఉండదు.

News February 18, 2026

పవన్ కళ్యాణ్‌ కాన్వాయ్‌కు ప్రమాదం

image

AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాన్వాయ్ ప్రమాదానికి గురైంది. ఆయన్ను పికప్ చేసుకునేందుకు విశాఖలోని సిరిపురం నుంచి పెద్దవాల్తేరు వెళ్తుండగా కాన్వాయ్‌లోని ఓ వాహనం సడన్ బ్రేక్ వేయడంతో ఒకదానికొకటి ఢీకొన్నాయి. దీంతో చివరి వాహనం దెబ్బతింది. ప్రమాద సమయంలో కాన్వాయ్‌లో పవన్ లేకపోవడం, ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.