News February 6, 2025
పిల్లల్ని నేనే చదివిస్తా.. ఏలూరు జిల్లా కలెక్టర్ హామీ

జంగారెడ్డిగూడెంలో చిన్నారులపై మారు తండ్రి జరిపిన పాశవిక దాడి చూసి జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి చలించిపోయారు. వారికి విద్య, వైద్యం, అందించేందుకు ముందుకు వచ్చారు. బుధవారం ఏలూరుకు తీసుకువచ్చిన బాధిత పిల్లలను అక్కున చేర్చుకుని వారిలో మనోధైర్యం నింపే విధంగా మాట్లాడారు. ఏది అవసరమైన అన్ని తాను చూస్తానని భరోసా ఇచ్చారు. ఇదిలా ఉంటే బాధిత పిల్లలకు పలువురు ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నారు.
Similar News
News March 26, 2025
తిరుపతి మేయర్ పీఠం కోసం కూటమి ప్రయత్నాలు

తిరుపతి మేయర్ పీఠం కోసం కూటమి ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఈ నెల 18న మేయర్‌గా డాక్టర్ శిరీష పదవీ కాలం నాలుగేళ్లు పూర్తి కానుంది. తిరుపతి కార్పొరేషన్‌లో ఒక MLA, MP, MLCతో కలిపి మొత్తం 50 మందికి ఓటు హక్కు ఉంది. ఇటీవల 10 మంది YCP కార్పొరేటర్లు జనసేనలో చేరారు. దాదాపు మరో 15 మంది కూటమిలో చేరే అవకాశం ఉన్నట్లు పలువురు పేర్కొన్నారు. మేయర్ పీఠంపై అటు YCP నేతలు సైతం ధీమాగా ఉన్నారు.
News March 26, 2025
KU సెమిస్టర్స్ ఫీజు చెల్లింపు గడువు పొడిగింపు

కాకతీయ యూనివర్సిటీ పరిధిలో డిగ్రీ 2, 4, 6 సెమిస్టర్ల పరీక్ష ఫీజు చెల్లింపు గడువును పొడిగిస్తున్నట్లు KU అధికారులు పేర్కొన్నారు. నిన్నటితో ఈ గడువు ముగియగా ఏప్రిల్ 2 వరకు ఎలాంటి అపరాధ రుసుము లేకుండా, రూ.50 ఫైన్‌తో ఏప్రిల్ 9 వరకు అవకాశం కల్పించినట్లు వెల్లడించారు.