News November 20, 2025

పిల్లల్లో అధిక రక్తపోటు లక్షణాలు

image

ప్రస్తుతకాలంలో పిల్లల్లోనూ హైబీపీ కనిపిస్తోంది. సకాలంలో గుర్తించి, చికిత్స చేయడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. పిల్లల్లో హైబీపీ ఉంటే తలనొప్పి, వాంతులు, ఛాతీ నొప్పి, గుండె వేగంగా కొట్టుకోవడం, శ్వాస ఆడకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. కాబట్టి వంశ చరిత్రలో బీపీ ఉంటే పిల్లలకు ఆరేళ్లు దాటిన తర్వాత ఏడాదికోసారి బీపీ చెక్ చేయడం మంచిది. జీవనశైలి మార్పులతో దీన్ని తగ్గించొచ్చని సూచిస్తున్నారు.

Similar News

News January 22, 2026

మాదకద్రవ్యాల నియంత్రణకు పటిష్ఠ చర్యలు: భద్రాద్రి కలెక్టర్

image

భద్రాద్రి జిల్లాలో మాదక ద్రవ్యాల నియంత్రణకు పటిష్ఠమైన చర్యలు చేపట్టాలని, మాదకద్రవ్యాలు, డ్రగ్స్ వినియోగం వల్ల కలిగే నష్టాలపై ప్రజల్లో విస్తృత స్థాయిలో అవగాహన కల్పించాలని కలెక్టర్ జితేశ్ వి.పాటిల్ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో జిల్లా స్థాయి నార్కోటిక్ కంట్రోల్ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. గంజాయి సాగు, మాదకద్రవ్యాల నియంత్రణకు చేపట్టాల్సిన కార్యక్రమాలపై చర్చించారు.

News January 22, 2026

ఖమ్మం: సోషల్ మీడియాపై పోలీసుల నజర్.. జర జాగ్రత్త..!

image

సోషల్ మీడియాపై పోలీసులు నిఘా పెట్టారు. ఎవరైనా సరే అనుచిత, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటున్నారు. తాజాగా టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్, సీఎం రేవంత్ రెడ్డిపై సోషల్ మీడియాలో అనుచిత, అసభ్య వ్యాఖ్యలు చేసిన రంగా ప్రవీణ్‌ను ఖమ్మం త్రీటౌన్ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. సోషల్ మీడియాలో ఇతరుల మనోభావాలను దెబ్బతీసేలా పోస్టులు చేయొద్దని ఉమ్మడి ఖమ్మం పోలీసులు సూచిస్తున్నారు.