News February 7, 2025
పీఎం స్కూల్ కింద 30 పాఠశాలలు ఎంపిక: VKB కలెక్టర్

జిల్లాలో ప్రధాన మంత్రి స్కూల్స్ పర్ రైసింగ్ ఇండియా స్కీం కింద 30 పాఠశాలలను ఎంపిక చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అన్నారు. గురువారం వికారాబాద్ కలెక్టరేట్‌లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లాలోని 30 పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఎంపికైన పాఠశాలల్లో కనీస సౌకర్యాలకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు.
Similar News
News March 28, 2025
అనకాపల్లి: పోలీసులకు గ్రీవెన్స్ నిర్వహించిన ఎస్పీ

అనకాపల్లి జిల్లాలో పోలీసుల సమస్యల పరిష్కారానికి ఎస్పీ తుహీన్ సిన్హాను శుక్రవారం గ్రీవెన్స్ నిర్వహించారు. జిల్లా ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్‌లో పలువురు పోలీసులు పాల్గొని వారి సమస్యలపై ఎస్పీకి వినతిపత్రం అందజేశారు. తన దృష్టికి వచ్చిన సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని ఎస్పీ ఈ సందర్భంగా వారికి హామీ ఇచ్చారు.
News March 28, 2025
రేపు భద్రకాళి ఆలయంలో ఒడిశాల బియ్యం వేలం

ఓరుగల్లు ఇలవేల్పు, తెలంగాణ ఇంద్రకీలాద్రి శ్రీ భద్రకాళి ఆలయంలో భక్తులు అమ్మవారికి సమర్పించిన 20 క్వింటాళ్ల ఒడిశాల బియ్యాన్ని ఈ నెల 29న ఉదయం 11 గంటలకు బహిరంగ వేలం ద్వారా విక్రయించనున్నట్లు ఈఓ శేషుభారతి తెలిపారు. వేలంలో పాల్గొనాలనుకునే వారు రూ.5 వేలు ధరావత్ సొమ్ము డీడీ రూపంలో చెల్లించి పాల్గొనాలని పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం భద్రకాళి దేవస్థాన కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు.
News March 28, 2025
అనకాపల్లి జిల్లాలో పదో తరగతి పరీక్షకు 222 మంది గైర్హాజరు

అనకాపల్లి జిల్లాలో శుక్రవారం జరిగిన పదో తరగతి బీఎస్ పరీక్షకు 222 విద్యార్థులు గైర్హాజరు అయినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి అప్పారావు నాయుడు ఓ ప్రకటనలో తెలిపారు. రెగ్యులర్ విద్యార్థులు 20,774 మంది హాజరు కావాల్సి ఉండగా 20,669 మంది హాజరైనట్లు తెలిపారు. ఒకసారి ఫెయిల్ అయిన విద్యార్థులు 766 మంది హాజరు కావాల్సి ఉండగా 649 మంది హాజరైనట్లు తెలిపారు. పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్నాయన్నారు.