News May 22, 2024
పీటీఎం: నిద్ర మాత్రలు మింగిన యువకుడు

పీటీఎం మండలంలో ఓ యువకుడు నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యాయత్నంకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. ఒడ్డిపల్లెకి చెందిన మురళి (38) కుటుంబ సమస్యల కారణంగా జీవితంపై విరక్తి చెందాడు. దీంతో నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా, కుటుంబీకులు గమనించి బి.కొత్తకోటకు తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మదనపల్లె జిల్లా ఆస్పత్రికి తరలించగా, డాక్టర్లు అతనికి మెరుగైన వైద్యం అందించారు.
Similar News
News March 14, 2026
CTR: వాటర్ బాటిల్ ధరల పెంపు ఇందుకే.!

ముడి చమురు నుంచి ఉత్పత్తి అయ్యే ‘పాలిమర్’ వాటర్ బాటిల్ తయారీకి కీలకం. యుద్ధ నేపథ్యంలో చమురు రేట్లు పెరగటంతో పాలిమర్ రేట్లు సైతం 50% మేర పెరిగాయి. ఇక వాటర్ బాటిల్ క్యాప్ ధర కూడా దాదాపు రూ.0.50 పైసలకు పెరిగింది. ప్రస్తుతం మార్కెట్‌లో పాలిమర్ KG ధర రూ.160-180 మధ్య ఉంది. ఇంతకు ముందు ఇది రూ.10లోపే ఉండేదని వ్యాపారులు అంటున్నారు. దీంతో దుకాణాల్లో <<19382920>>వాటర్ బాటిల్స్<<>> ధరలు పెరుగనున్నట్లు తెలుస్తోంది.
News March 14, 2026
యుద్ధం ఎఫెక్ట్.. చిత్తూరు జిల్లాలో పెరిగిన వాటర్ బాటిల్ ధరలు?

చిత్తూరులో శనివారం జిల్లా <<19383334>>వాటర్<<>> అసోసియేషన్ ఆధ్వర్యంలో సమీక్ష జరిగింది. యుద్ధ ప్రభావంతో ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ తయారీకి అవసరమైన రా మెటీరియల్ ధరలు భారీగా పెరిగాయని తయారీదారులు అంటున్నారు. దీని వలన తమపై అధిక భారం పడుతోందని, దీంతో వాటర్ బాటిల్ ధరలను తప్పనిసరిగా పెంచాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. పెంచిన ధరలకు డీలర్లు సహకరించాలని జిల్లా వాటర్ అసోసియేషన్ ప్రతినిధులు కోరారు.
News March 14, 2026
చిత్తూరు: పౌల్ట్రీ రైతులకు కష్టాలు!

చిత్తూరు జిల్లాలో పెద్ద సంఖ్యలో రైతులు పౌల్ట్రీ ఫారాలపై ఆధారపడి జీవిస్తున్నారు. ఈ ఏడాది ప్రారంభం నుంచి వారిని కష్టాలు వీడటం లేదు. జిల్లాలో బర్డ్ ఫ్లూ ప్రభావంతో కొద్దిరోజులు చికెన్ విక్రయాలు తగ్గిపోవడంతో నష్టపోయారు. యుద్ధ ప్రభావంతో కోడిగుడ్ల ఎగుమతులు నిలిచిపోయాయి. వారం రోజుల క్రితం డజన్ కోడిగుడ్ల రిటైల్ ధర రూ.72 ఉండగా ప్రస్తుతం అది రూ.66కు చేరుకుంది.


