News October 7, 2025
పీలేరులో పతాకస్థాయికి MLA పీఏ భూకబ్జాలు: YCP

పీలేరు <<17935208>>MLA కిషోర్ కుమార్ పీఏ<<>> సత్య తన భూమిని కబ్జా చేశారని అనురాధ అనే మహిళ ఎస్పీకి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ‘కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పీలేరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే అనుచరవర్గం భారీగా కబ్జాలు చేస్తోంది. పీలేరులో ఎమ్మెల్యే పీఏ భూకబ్జాలు పతాకస్థాయికి చేరాయి. ఈ 15 నెలల్లో ఇసుక, లిక్కర్‌లో దోచుకుంది మీ వాళ్లకి సరిపోలేదా చంద్రబాబు?’ అంటూ YCP ట్వీట్ చేసింది.
Similar News
News January 23, 2026
మంచిర్యాల: ముగిసిన నూతన సర్పంచులు శిక్షణా తరగతులు

ఐదు రోజులుగా కొనసాగిన నూతన సర్పంచుల శిక్షణా తరగతులు ఈరోజు ముగిశాయి. జిల్లా స్థాయిలో నూతన సర్పంచులకు ముల్కల వద్ద స్థానిక కళాశాలలో ఈనెల 19వ తేదీ నుంచి ఈరోజు వరకు శిక్షణా తరగతుల కార్యక్రమాన్ని పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ శిక్షణ శిబిరంలో సర్పంచులకు గ్రామ పరిపాలన, గ్రామ అభివృద్ధి, ప్రజాపాలన, గురించి శిక్షణ ఇచ్చారు.
News January 23, 2026
రాష్ట్ర స్థాయి పోటీల్లో ఉమ్మడి ADB జిల్లాకు కాంస్య పతకం

నిజామాబాద్ జిల్లాలోని కమ్మరపల్లిలో గత మూడు రోజులుగా జరిగిన రాష్ట్ర స్థాయి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ అండర్-17 సాఫ్ట్ బాల్ పోటీల్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బాలుర జట్టు కాంస్య పతకం సాధించింది. ఈ పోటీల్లో ప్రతిభ కనబర్చిన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా జట్టు క్రీడాకారులతోపాటు కోచ్ కోట యాదగిరిని ఎస్జీఎఫ్ సెక్రటరీలు వెంకటేశ్, యాకుబ్, సాఫ్ట్‌బాల్ అసోసియేషన్ సభ్యులు, పలువురు అభినందించారు.
News January 23, 2026
‘బంగ్లాదేశ్ కథ ముగిసినట్లే’.. నిరాశలో క్రికెటర్లు

T20 WC నుంచి BAN వైదొలగడంపై ఆ దేశానికి చెందిన పలువురు క్రికెటర్లు తీవ్ర నిరాశలో ఉన్నారు. ఈ విషయంలో ప్రభుత్వం జోక్యం చేసుకోవడంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారని మండిపడుతున్నారు. T20 కెప్టెన్ లిటన్ దాస్, టెస్ట్ కెప్టెన్ షాంటో టోర్నీలో ఆడేందుకు సిద్ధమని చెప్పినా, వారి మాటకు విలువ ఇవ్వలేదని సమాచారం. ‘బంగ్లా క్రికెట్ ముగిసినట్లే’ అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


