News November 19, 2025
పుట్టపర్తిలో ప్రధాని మోదీకి విష్ణువర్ధన్ రెడ్డి స్వాగతం

సత్యసాయి శత జయంతి ఉత్సవాల్లో భాగంగా పుట్టపర్తికి వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీకి బీజేపీ జాతీయ కమిటీ సభ్యుడు విష్ణువర్ధన్ రెడ్డి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ప్రధాని ఆయనను ఆప్యాయంగా పలకరించారు. మోదీ పుట్టపర్తికి వచ్చినందుకు ఆయనకు ధన్యవాదాలు తెలిపారు. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా ఆశీర్వాదాలు ప్రధానికి ఎల్లప్పుడూ ఉండాలని స్వామివారిని ప్రార్థించినట్లు విష్ణువర్ధన్ రెడ్డి తెలిపారు.
Similar News
News January 23, 2026
MEGA 158లో చిరు సరసన ప్రియమణి!

చిరంజీవి ప్రస్తుతం ‘మన శంకరవరప్రసాద్ గారు’ మూవీ సక్సెస్‌ని ఎంజాయ్ చేస్తున్నారు. మరోవైపు బాబీ డైరెక్షన్‌లో రాబోతున్న ‘మెగా 158’ మూవీ స్క్రిప్ట్ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. అయితే ఈ మూవీలో చిరంజీవి భార్య పాత్రలో ప్రియమణి కనిపించబోతున్నట్లు సినీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. ఇప్పటికే కుమార్తె పాత్రలో హీరోయిన్ కృతిశెట్టి నటించబోతున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే వీటిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
News January 23, 2026
అనంతపురం JNTU విద్యార్థులకు భారీ ప్యాకేజీతో ఉద్యోగాలు

అనంతపురం JNTU ఇంజినీరింగ్ కళాశాలలో Accenture కంపెనీ నిర్వహించిన ప్రాంగణ నియామకాలలో 11 మంది విద్యార్థులు ఎంపికయ్యారు. వీరిలో ఆరుగురికి రూ.6.5 లక్షలు, ఐదుగురికి రూ.4.5లక్షల వార్షిక వేతనంతో ఉద్యోగాలు లభించినట్లు ప్లేస్‌మెంట్ ఆఫీసర్ శ్రీనివాసులు తెలిపారు. ప్రతిభ చాటిన విద్యార్థులను VC సుదర్శన రావు, ప్రిన్సిపల్ చెన్నారెడ్డి అభినందించారు. మంచి ప్యాకేజీలతో ఉద్యోగాలు సాధించడంపై కళాశాలలో హర్షం వ్యక్తమైంది.
News January 23, 2026
బాపట్ల: రూ.102 కోట్లతో 260 కొత్త ఆరోగ్య కేంద్రాలు

బాపట్ల పార్లమెంట్ పరిధిలో వైద్య సేవలను మెరుగుపరిచేందుకు రూ.102.336 కోట్లతో 260 కొత్త ఆరోగ్య కేంద్రాల నిర్మాణానికి ఆమోదం లభించిందని గురువారం MP కృష్ణప్రసాద్ తెలిపారు. మంజూరైన వాటిలో 234 గ్రామీణ ఆరోగ్య కేంద్రాలు, 18 బ్లాక్ హెల్త్ యూనిట్లు, 5 పీహెచ్‌సీలు, 1 క్రిటికల్ కేర్ బ్లాక్ ఉన్నాయని వివరించారు. పేదలకు నాణ్యమైన వైద్యాన్ని చేరువ చేయడమే లక్ష్యమని వెల్లడించారు.


