News March 11, 2025

పుట్టపర్తి SP కార్యాలయానికి 55 ఫిర్యాదులు.!

image

పుట్టపర్తి ఎస్పీ కార్యాలయంలో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 55 ఫిర్యాదులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. సంబంధిత అర్జీదారుల సమస్యలు సకాలంలో పరిష్కరించాలన్నారు. అనంతరం అర్జీదారుల ఫిర్యాదు మేరకు.. సంబంధిత PSకు టెలికాన్ఫరెన్స్ ద్వారా సమస్యపై అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Similar News

News January 24, 2026

షోరూంలోనే రిజిస్ట్రేషన్.. నేటి నుంచే అమల్లోకి

image

TG: వాహనాల రిజిస్ట్రేషన్ కోసం RTO ఆఫీసుల చుట్టూ తిరిగే తిప్పలు నేటితో ముగియనున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ‘డీలర్ పాయింట్ రిజిస్ట్రేషన్’ విధానం నేటి నుంచి అమల్లోకి వస్తోంది. నిన్న మాదాపూర్‌లో చేసిన ట్రయల్ రన్ సక్సెస్ అయ్యింది. ఇకపై బండి కొన్న షోరూమ్‌లోనే ఫొటోలు, డాక్యుమెంట్లు ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేసి అక్కడికక్కడే నంబర్ పొందొచ్చు. RC నేరుగా ఇంటికే పోస్టులో వచ్చేస్తుంది.

News January 24, 2026

యాదగిరిగుట్టలో రౌడీషీటర్ హత్య..UPDATE

image

యాదగిరిగుట్ట మైలార్‌గూడెం శివారులో ఓ కాటేజీలో శుక్రవారం <<18940229>>రౌడీషీటర్ <<>>నిశాంత్ ఠాకూర్ హత్యకు గురైన విషయం తెలిసిందే. పట్టణంలోని అంగడిబజార్‌కు చెందిన నిశాంత్ తన స్నేహితుడితో కలిసి కాటేజీకి వెళ్లగా, అక్కడ మరో వ్యక్తితో గొడవ జరిగింది. ఆ ఇద్దరు వ్యక్తులు నిశాంత్‌ను కత్తితో పొడిచి పరారయ్యారు. మృతుడిపై గతంలో 11కేసులున్నాయని, పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చినా ప్రవర్తన మార్చుకోలేదని సీఐ భాస్కర్ తెలిపారు.

News January 24, 2026

ఖమ్మం జిల్లాలో ఇసుక మాఫియాకు చెక్

image

ఇప్పటి వరకు విచ్చలవిడిగా సాగిన ఇసుక మాఫియా ఆగడాలకు అడ్డుకట్ట పడనుంది. జిల్లాలో ఇసుక కావాల్సిన వారు ‘మన ఇసుక-మన వాహనం’ యాప్ ద్వారా బుక్ చేసుకుంటే 24గంటల్లో డోర్ డెలివరీ చేస్తారు. క్వారీ నుంచి ఇంటి దూరాన్ని బట్టి ధర ఉంటుందని అధికారులు వెల్లడించారు. రాష్ట్రంలోనే తొలిసారిగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఈ విధానాన్ని అమలు చేస్తున్నారు. వారంరోజుల్లో ఈ యాప్ అందుబాటులోకి రానుందని పేర్కొన్నారు.