News August 31, 2024
పుట్టినరోజు శుభాకాంక్షలు
ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి
Similar News
News September 20, 2024
నేటి నుంచి ఆన్‌లైన్‌లో ఇసుక బుకింగ్
AP: ఇసుక బుకింగ్ కోసం రూపొందించిన ఏపీ శాండ్ మేనేజ్‌మెంట్ పోర్టల్ నేడు అందుబాటులోకి రానుంది. ఉ.10.30-మ.12 వరకు గ్రామ, వార్డు సచివాలయాల్లో, మ.12-సా.6 వరకు ఎవరైనా వ్యక్తిగతంగా బుకింగ్ చేసుకునేలా పోర్టల్‌ను రూపొందించారు. అయితే 24 గంటలూ బుకింగ్‌కు అవకాశం ఉండాలని CM చంద్రబాబు ఆదేశించడంతో అధికారులు మార్పులు చేస్తున్నారు. వాగులు, వంకల నుంచి ఇసుక తీసుకెళ్లే ప్రజలను ఇబ్బంది పెట్టొద్దని ఆయన స్పష్టం చేశారు.
News September 20, 2024
ఇసుక ఆన్‌లైన్ బుకింగ్ ఇలా
✒ <
✒ ఆ తర్వాత జనరల్ కన్‌జ్యూమర్ అనే ఆప్షన్‌పై క్లిక్ చేసి, ఆధార్, మొబైల్ నంబర్ నమోదు చేయాలి.
✒ మెయిల్ ఐడీ, చిరునామా ఎంటర్ చేస్తే రిజిస్ట్రేషన్ ఖరారవుతుంది.
✒ ఆ తర్వాత నిర్మాణ వివరాలు నమోదు చేయాలి. పేమెంట్ పూర్తిచేశాక ఏ రోజు డెలివరీ అవుతుందో మెసేజ్ వస్తుంది.
News September 20, 2024
‘మీసేవ’లో సర్వర్ సమస్యలు.. ప్రజలకు ఇబ్బందులు
TG: రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 3 వారాలుగా ‘మీసేవ’ సర్వర్లలో సమస్యలు ఏర్పడుతున్నాయి. క్యాస్ట్, ఇన్‌కమ్, నివాస, జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు, ఇతర సర్టిఫికెట్లు డౌన్‌లోడ్ కాకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వీలైనంత త్వరగా సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు. రాష్ట్రంలోని 5,216 మీసేవా కేంద్రాల ద్వారా 38 శాఖలకు చెందిన 204 రకాల సేవలు అందుతున్నాయి.