News September 13, 2025

పుత్తూరులో రోడ్డు ప్రమాదం.. ఒకరి స్పాట్ డెడ్

image

పుత్తూరు పట్టణంలోని పరమేశ్వరమంగళం KKC కళాశాల సమీపంలో శుక్రవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చెన్నై వైపు వెళ్తున్న లారీ అతివేగంగా బైకును ఢీకొట్టింది. ఈ ఘటనలో ద్విచక్ర వాహనదారుడు సతీశ్ అరక్కోణం మృతి చెందగా, మరో వ్యక్తికి తీవ్ర గాయాలు అయ్యాయి. మృతి చెందిన సతీశ్, ఓ ప్రైవేట్ సంస్థలో ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Similar News

News December 7, 2025

ఇంటర్నెట్ లేకున్నా UPI చెల్లింపులు చేయొచ్చు

image

ఇంటర్నెట్ లేకుండానే UPI చెల్లింపులకు నేషనల్ పేమెంటు కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కొత్త ఫీచర్‌ను ఏర్పాటు చేసింది. USSD ఆధారిత ఫీచర్ ద్వారా నెట్ లేకున్నా, మారుమూల ప్రాంతాల నుంచి చెల్లింపులు చేయొచ్చు. అయితే ముందుగా బ్యాంకు ఖాతాతో లింక్ అయి ఉన్న మొబైల్ నంబర్‌తో ‘*99#’కి డయల్ చేసి ఆఫ్‌లైన్ UPIని పొందాలి. ఆపై USSD ఫీచర్‌తో చెల్లింపులు చేయాలి. దేశంలో 83 BANKS, 4 టెలి ప్రొవైడర్ల నుంచి ఈ అవకాశం అందుబాటులో ఉంది.

News December 7, 2025

SKLM: రేపు యథావిధిగా PGRS- కలెక్టర్

image

ప్రజా ఫిర్యాదుల నమోదు, పరిష్కార వేదిక శ్రీకాకుళం జిల్లా పరిషత్ కార్యాలయంలో సోమవారం జరుగుతుందని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్జీదారులు వారి సమస్యలు నమోదు చేసుకోవడానికి Meekosam.ap.gov.in వెబ్సైట్ ను వినియోగించుకోవాలని ఆయన పేర్కొన్నారు. అర్జీలు సమర్పించిన అనంతరం 1100 నంబర్ కు నేరుగా ఫోన్ చేసి, వినతులకు సంబంధించిన స్థితి సమాచారం తెలుసుకోవచ్చని అన్నారు.

News December 7, 2025

ఫ్యూచర్ సిటీ రోడ్డుకు ‘రతన్ టాటా’ పేరు.. సీఎం నిర్ణయం

image

తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ నేపథ్యంలో సీఎం రేవంత్ వినూత్న ప్రతిపాదనలు తీసుకొచ్చారు. ప్రపంచ ప్రఖ్యాత వ్యక్తులు, కంపెనీల పేర్లను HYD ప్రధాన రోడ్లకు పెట్టాలని నిర్ణయించారు. ఫ్యూచర్ సిటీ రోడ్డుకు ‘రతన్ టాటా’, అమెరికన్ కాన్సులేట్ రహదారికి ‘డొనాల్డ్ ట్రంప్ అవెన్యూ’ పేర్లను పెట్టనున్నారు. అలాగే పలు కీలక రోడ్లకు గూగుల్ స్ట్రీట్, మైక్రోసాఫ్ట్ రోడ్, విప్రో జంక్షన్ పేర్లను పరిశీలిస్తున్నారు.