News August 20, 2025
పురానాపూల్: పాఠశాలను సందర్శించిన కలెక్టర్

పురానాపూల్‌లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, స్థానిక పాఠశాలను హైదరాబాద్ జిల్లా కలెక్టర్ హరిచందన ఈరోజు సందర్శించారు. డిజిటల్ క్లాసులతో విద్యా ప్రమాణాలు మెరుగుపడతాయని తెలిపారు. విద్యార్థులు మంచిగా చదువుకుంటూనే అద్భుతమైన భవిష్యత్తు ఉంటుందన్నారు.అలాగే ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సీజనల్ వ్యాధులకు సంబంధించి మందులు అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. సీజనల్ వ్యాధులు నియంత్రించడంపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు.
Similar News
News January 17, 2026
HYD: ఈ వారం టన్నెల్ ప్లాన్ ఖరారు

జేబీఎస్-శామీర్‌పేట కారిడార్‌లో భాగంగా హకీంపేట వద్ద 1.6 కిలోమీటర్ల మేర మెట్రోను అండర్ గ్రౌండ్‌లో నిర్మించాలని ఈ వారంలోనే ప్రభుత్వం పక్కాగా ఓకే చేసింది. రక్షణ శాఖ నిబంధనల ప్రకారం భారీ బడ్జెట్‌తో ఈ టన్నెల్ ప్లాన్ ఫైనల్ అయ్యింది. వచ్చే నెలలో ఇక్కడ మట్టి పరీక్షలు, టన్నెల్ మిషన్ల కోసం సర్వే మొదలు కానుంది. హకీంపేట రన్‌వే దగ్గర మెట్రో పిల్లర్లు కనిపించవు. మెట్రోకున్న అతిపెద్ద అడ్డంకి <<18874553>>క్లియర్<<>> అయిపోయింది.
News January 17, 2026
రాడార్ల కోసం ‘అండర్ గ్రౌండ్’ మెట్రో

జేబీఎస్-శామీర్‌పేట మెట్రో వైర్ల నుంచి వెలువడే హై-వోల్టేజ్ కరెంటు యుద్ధ విమానాల రాడార్లకు ముప్పుగా మారుతుందని 2025 చివరలో ఒక టెక్నికల్ రిపోర్ట్ ఇచ్చారు. ఈ రేడియేషన్ వల్ల విమానాల ‘టార్గెట్ లాకింగ్’ సిస్టమ్స్ దెబ్బతింటాయని తేలింది. అందుకే ఈ కారిడార్‌లో హకీంపేట వద్ద మెట్రోను <<18874537>>భూమి లోపల<<>> సొరంగంలో తీసుకెళ్తే ఆ మట్టి ఒక సహజ కవచంలా పనిచేసి సిగ్నల్స్ బయటకు రాకుండా ఆపుతుందని ప్లాన్ చేశారు.
News January 17, 2026
JBS-శామీర్‌పేట మెట్రో: ఎయిర్ బేస్ దగ్గర పిల్లర్ల పరేషాన్

JBS-శామీర్‌పేట మెట్రో లైన్ నిర్మాణంలో హకీంపేట ఎయిర్ బేస్ రన్‌వే ఒక పెద్ద అడ్డంకిగా మారింది. ఇక్కడ పిల్లర్లు వేస్తే యుద్ధ విమానాలు ల్యాండ్ అయ్యేటప్పుడు ఆ ఎత్తు అడ్డు తగులుతుందని 2025 మధ్యలో ఆర్మీ అభ్యంతరం పెట్టింది. రన్‌వేకి అంత దగ్గరలో మెట్రో పిల్లర్లు ఉంటే పైలట్లకు సేఫ్టీ ప్రాబ్లమ్ వస్తుందని క్లియరెన్స్ ఆపేశారు. దీంతో ఈ 1.6 కిలోమీటర్ల మేర మెట్రోను భూమి లోపలికి దించేయాలని ప్లాన్ మార్చారు.


