News August 12, 2025

పులివెందులలో ఓటు వేయని YCP అభ్యర్థి

image

పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికలో కీలక పరిణామం వెలుగు చూసింది. వైసీపీ అభ్యర్థి తుమ్మల హేమంత్ రెడ్డి తన ఓటు హక్కు వినియోగించుకో లేదు. ఉదయం నుంచి గొడవలు జరుగుతుండటంతో ఆయన ఇంటికే పరిమితమయ్యారు. పోలీసులు హేమంత్ రెడ్డి ఇంటి వద్దకు వెళ్లి ఓటు వేయడానికి రావాలని కోరారు. అయినప్పటికీ ఆయన నిరాకరించారు. టీడీపీ బహిరంగంగా రిగ్గింగ్ చేస్తుంటే ఓటు ఎలా వేయాలని ఆయన ప్రశ్నించినట్లు సమాచారం.

Similar News

News March 12, 2026

ADB: బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధిగా అశోక్

image

బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఆదిలాబాద్ జిల్లా నుంచి అశోక్ ముస్తాపూరేను రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు నియమించారు. తనపై విశ్వాసం ఉంచి ఈ బాధ్యతను అప్పగించిన బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడికి అశోక్ ముస్తాపూరే హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. పార్టీ తరఫున ప్రజల సమస్యలపై గళం వినిపిస్తూ, తెలంగాణలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని పేర్కొన్నారు.

News March 12, 2026

పాపం జెన్‌జీలు

image

జెన్‌జీల జీవితం ఎమోషనల్ మూవీని తలపిస్తోంది. చదువుకోవాల్సిన సమయంలో కొవిడ్ లాక్డౌన్లు అడ్డుపడగా.. కెరీర్ మొదలుపెట్టే వేళ AI సవాలు విసురుతోంది. ఆర్థిక మాంద్యం, పెరిగిన ధరలతో సొంత ఇల్లు కలగానే మిగిలిపోతోంది. ఇక పెళ్లి చేసుకుందామంటే పెరుగుతున్న విడాకుల శాతం భయపెడుతోంది. అటు కెరీర్ టెన్షన్లు, ఇటు సామాజిక ఒత్తిళ్లతో ఈ తరం ఉక్కిరిబిక్కిరి అవుతోంది. వీరి పరిస్థితి ‘ముందు నుయ్యి.. వెనుక గొయ్యి’లా మారింది.

News March 12, 2026

NRPT: ఈనెల 31న జిల్లా స్థాయి స్పోర్ట్స్ స్కూల్ సెలక్షన్స్

image

నారాయణపేట జిల్లాలో 4 తరగతి స్పోర్ట్స్ స్కూల్ ప్రవేశాల కోసం ఈ నెల 13 నుంచి 17 వరకు మండల స్థాయిలో సెలక్షన్స్ నిర్వహించనున్నట్లు జిల్లా క్రీడా అధికారి వెంకటేష్ తెలిపారు. ప్రతి మండలంలో కనీసం 20 మంది బాలురు, 20 మంది బాలికలు నమోదు కావాలని సూచించారు. వారిలో నుంచి 10 మంది బాలురు, 10 మంది బాలికలను ఎంఈవో లాగిన్ ద్వారా జిల్లా స్థాయికి పంపిస్తారు. 31న జిల్లా స్థాయిలో మినీ స్టేడియంలో ఉదయం జరుగుతాయని తెలిపారు.