News August 12, 2024

పులివెందులలో దొంగల భయం

image

పులివెందుల పట్టణంలోని పార్నపల్లి బస్టాండ్‌లో వరుస దొంగతనాలతో ప్రయాణికులు హడలెత్తిపోతున్నారు. ఇటీవల కాలంలో ఈ ప్రాంతంలో దాదాపు 10కి పైగా దొంగతనాలు జరిగాయని సమాచారం. లింగాలకు చెందిన ఓ వ్యక్తి నుంచి వరుసగా 3 సెల్ ఫోన్లు, రూ.లక్ష నగదు వేర్వేరు సమయాల్లో దొంగలు దోచుకెళ్లారు. ఈ విషయమై అర్బన్ సీఐ మోహన్ కుమార్‌ మాట్లాడుతూ.. పార్నపల్లి బస్టాండ్‌లో దొంగతనాలు జరగకుండా పోలీసులతో గస్తీ నిర్వహిస్తామని చెప్పారు.

Similar News

News September 14, 2024

ఎర్రగుంట్ల: తండ్రి తాగొద్దని చెప్పినందుకు కొడుకు సూసైడ్

image

ఎర్రగుంట్లలో ఓ యువకుడు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికుల వివరాల ప్రకారం.. ఎర్రగుంట్ల పట్టణానికి చెందిన చింతకుంట వెంకట్(18) రోజూ తాగి ఇంటికి వస్తుంటాడు. తన తండ్రి మందు తాగొద్దని మందలించేవాడని తెలిపారు. దీంతో శనివారం ఉదయం వెంకట్ ఆత్మహత్యకు పాల్పడ్డాడని పేర్కొన్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు. మరిన్ని విషయాలు తెలియాల్సి ఉంది.

News September 14, 2024

ప్రొద్దుటూరు: ‘మా పాప మృతికి కారణం వైద్యులే’

image

ప్రొద్దుటూరులో శుక్రవారం రాత్రి విషాదం నెలకొంది. పట్టణంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చాపాడు మండలం నక్కలదిన్నెకు చెందిన బాలఎల్లయ్య, సుమలతల కుమార్తె జసికాశ్రీ చికిత్స తీసుకుంటూ మృతి చెందింది. దీనికి కారణం చిన్నారి ఊపిరితిత్తిలో నిమ్ము ఎక్కువ అవ్వడమేనని వైద్యులు తెలిపారు. అయితే తమ పాప మృతికి కారణం వైద్యులే అని చిన్నారి బంధువులు ఆందోళనకు దిగారు.

News September 14, 2024

కడప: ‘17 నుంచి స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాలు’

image

అక్టోబర్ 2న ‘స్వచ్ఛ భారత్ దివస్’ నిర్వహించుకుంటున్న నేపథ్యంలో ఈనెల 17 నుంచి వచ్చేనెల ఒకటో తేదీ వరకు ‘స్వచ్ఛతా హీ సేవా’ పేరుతో, కార్యక్రమాలు చేపట్టాలని కడప జిల్లా కలెక్టర్ శివ శంకర్ లోతేటి సూచించారు. కలెక్టర్ కార్యాలయంలో మండలాల అధికారులతో వీసీ ద్వారా శుక్రవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈనెల 17 నుంచి అక్టోబర్ రెండో తేదీ వరకు జిల్లా “స్వచ్ఛతా హీ సేవా” కార్యక్రమం నిర్వహిస్తామన్నారు.