News April 9, 2024
పులివెందులలో MLAగా నిర్మల పోటీ

ఏపీలో భారత చైతన్య యువజన పార్టీ తరఫున పోటీ చేసే 32 మంది అభ్యర్థుల జాబితాను ఆ పార్టీ అధినేత రామచంద్ర యాదవ్(RCY) విడుదల చేశారు. తొలి జాబితాలో ఉమ్మడి కడప జిల్లా నుంచి ఇద్దరికి అవకాశం కల్పించారు. పులివెందులలో సూరే నిర్మల, రైల్వేకోడూరులో పూటిక సుబ్బారాయుడు పోటీ చేయనున్నారు. ఉమ్మడి జిల్లాలోని మిగిలిన 8 స్థానాలకు త్వరలో అభ్యర్థులను ఖరారు చేస్తామని రామచంద్ర యాదవ్ స్పష్టం చేశారు.
Similar News
News December 13, 2025
తొండూరులో 9 మంది విద్యార్థులకు అస్వస్థత

తొండూరు మండలంలోని యాదవారిపల్లె ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో శనివారం మధ్యాహ్నం భోజనం తిన్న 9 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. విద్యార్థులకు విరేచనాలు అవుతుండడంతో తొండూరు 108 వాహనంలో చికిత్స నిమిత్తం పులివెందుల హాస్పిటల్‌కు తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News December 13, 2025
వరంగల్‌లో బద్వేల్‌కు చెందిన ప్రొఫెసర్ సూసైడ్

కడప జిల్లా బద్వేల్‌కి చెందిన ప్రొఫెసర్ వెంకట సుబ్బారెడ్డి వరంగల్ NITలో అసోసియేట్ ప్రొఫెసర్‌గా పని చేస్తున్నారు. శుక్రవారం ధర్మసాగర్ రిజర్వాయర్‌లో పడి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటనపై కేసును హనుమకొండ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం ప్రొఫెసర్ వెంకట సుబ్బారెడ్డి కంప్యూటర్ విభాగంలో పని చేస్తున్నట్లు సమాచారం. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News December 13, 2025
కడప: నేడు నవోదయ ఎంట్రన్స్.. ఇవి పాటించండి.!

జవహర్ నవోదయ పాఠశాలల్లో ప్రవేశాలకు పరీక్ష రాసే విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు ఒక గంట ముందుగానే చేరుకోవాలని డిఇఓ శంషుద్దీన్ పేర్కొన్నారు. నేడు కడప జిల్లా వ్యాప్తంగా 2,616 మంది విద్యార్థులు నమోదు చేసుకున్నట్లు వెల్లడించారు. జిల్లాలో 14 కేంద్రాల్లో విద్యార్థులకు పరీక్ష నిర్వహిస్తున్నట్లు చెప్పారు. శనివారం ఉదయం 11:30 నిమిషాల నుంచి మధ్యాహ్నం 1:30 నిమిషాల వరకు పరీక్ష ఉంటుందని అన్నారు.


