News August 14, 2025
పులివెందుల, ఒంటిమిట్ట: గెలిచేదెవరు?

పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికల ఫలితాలు నేడు వెలువడనున్నాయి. ఒక రౌండ్‌లో పులివెందుల ఫలితం, దాదాపు 3 రౌండ్లలో ఒంటిమిట్ట జడ్పీటీసీ అభ్యర్థుల భవితవ్యం తేలనుంది. పులివెందులలో 74 శాతం ఓటింగ్ జరగగా.. ఒంటిమిట్టలో 86 శాతం ఓటింగ్ జరిగినట్లు అధికారులు తెలిపారు. కడప శివారులోని ఉర్దూ యూనివర్సిటీలో కౌంటింగ్ జరగనుంది. దాదాపు 100 మందికి పైగా సిబ్బంది కౌంటింగ్‌లో పాల్గొననున్నారు.
Similar News
News March 17, 2026
అనకాపల్లి: ఇంటర్ ఫస్టియర్ పరీక్షకు 217 గైర్హాజరు

అనకాపల్లి జిల్లాలో మంగళవారం జరిగిన ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షకు 217 మంది విద్యార్థులు గైర్హాజరు అయినట్లు డీఐఈవో వినోద్ బాబు తెలిపారు. మొత్తం 9,552 మంది హాజరు కావలసి ఉండగా 9,335 మంది హాజరైనట్లు పేర్కొన్నారు. పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్నాయన్నారు. ఎటువంటి మాస్ కాపీయింగ్‌కు అవకాశం లేకుండా పగడ్బందీగా నిర్వహిస్తున్నామన్నారు.
News March 17, 2026
జగిత్యాల: కుక్క కాటు.. ప్రాణం తీసింది..!

జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం కోటిలింగాల గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన మణితేజ(7) కుక్కకాటుకు గురై, 15 నెలలపాటు మృత్యువుతో పోరాడి చనిపోయాడు. 2024 డిసెంబర్ 26న మెడ భాగంలో కుక్క కరవడంతో వెంటనే HYDలో చికిత్స అందించారు. అనంతరం ఇంట్లోనే ప్రత్యేక గదిని ఏర్పాటు చేసి వైద్యం కొనసాగించారు. సుమారు రూ.65 లక్షలు ఖర్చు చేసినప్పటికీ బాలుడిని కాపాడలేకపోయారు.
News March 17, 2026
జగిత్యాల: జీవన్ రెడ్డి అసంతృప్తి వెనుక బలమైన కారణాలు ఇవే!

నాలుగు దశాబ్దాలుగా కాంగ్రెస్‌లో ఉన్న జీవన్ రెడ్డి 11 సార్లు పోటీ చేసి ఆరు సార్లు గెలిచారు. మూడు సార్లు మంత్రి, ఒకసారి ఎమ్మెల్సీగా పనిచేశారు. కానీ 2023 తర్వాత మంత్రి పదవి దక్కకపోవడం, MLC రెన్యూవల్ లేకపోవడం అసంతృప్తికి కారణమైంది. డా.సంజయ్‌తో కలిసి పని చేయాల్సి రావడం, మున్సిపల్ ఎన్నికల్లో తన వర్గానికి ప్రాధాన్యం లేకపోవడంతో ఇండిపెండెంట్లను గెలిపించారు. ప్రస్తుతం ఆయన తదుపరి అడుగు ఆసక్తిగా మారింది.


