News August 13, 2025
పులివెందుల ZPTC రీ పోలింగ్ శాతం @12 PM

పులివెందుల ZPTC ఉప ఎన్నికల నేపథ్యంలో బుధవారం రీ పోలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ఉదయం 10 గంటలకు పోలింగ్ శాతం వివరాలను అధికారులు వెల్లడించారు.
అచివెల్లి(3): 33.74 శాతం.
మొత్తం ఓట్లు 492 కాగా.. ఇప్పటి వరకు 166 ఓట్లు పోలయ్యాయి.
E. కొత్తపల్లి (14): 26.71 శాతం.
మొత్తం ఓట్లు కాగా 1,273 ఓట్లు కాగా.. ఇప్పటి వరకు 340 ఓట్లు పోలయ్యాయి.
Similar News
News March 9, 2026
కడప: శనగ కొనుగోలు కేంద్రాల్లో అదనపు వసూళ్లపై జేసీ ఆగ్రహం.!

కడప జిల్లాలో శనగ కొనుగోలు కేంద్రాల్లో రైతుల నుంచి అదనపు వసూళ్లు చేస్తుండడంపై వస్తున్న పిర్యాదులపై జేసీ నిధిమీనా ఆగ్రహం వ్యక్తం చేశారు. శనగ కొనుగోలు కేంద్రాల్లోని పరిస్థితులపై సోమవారం సాయంత్రం కడపలో సంబంధిత అధికారులతో జేసీ సమావేశం నిర్వహించారు. హ్యాండ్లింగ్, క్లీనింగ్ పేరుతో అదనపు వసూళ్లపై ఆరా తీశారు. కలెక్టర్ వద్దకు తీసుకెళ్లాలని నిర్ణయించారు. మార్క్ ఫెడ్ DM, DCMS BM, DCO పాల్గొన్నారు.
News March 9, 2026
కడపలో కేవలం ఆయన వర్గం టీడీపీలోకి వెళ్తోందా?

కడపలో ఇటీవల YCP నుంచి TDPలోకి కార్పొరేటర్లు చేరుతున్నారు. ఇందులో సింహభాగం మాజీ మేయర్ సురేశ్ బాబు వర్గమే TDP కండువా కప్పుకున్నట్లు తెలుస్తోంది. మొదటగా ఆయన ప్రధాన అనుచరుడిగా పేరున్న సూర్యనారాయణ TDPలో చేరారు. ఆ తర్వాత దాదాపు 8 మంది కార్పొరేటర్లు YCPకి గుడ్ బై చెప్పారు. తాజాగా మరో నలుగురు చేరారు. మేయర్ సీటు కోల్పోవడంతో ఆయనే TDPలోకి పంపిస్తున్నారంటూ YCPలోని మరో వర్గం గుసగుసలాడుతున్నాయి.
News March 9, 2026
బద్వేల్: సొసైటీ బ్యాంకులో రూ.5 కోట్లకు పైగా అవినీతి?

బద్వేల్ ZPTC వంకెల చిన్న పోలిరెడ్డి గతంలో సొసైటీ ఛైర్మన్‌గా ఉన్నప్పుడు రూ.5 కోట్లకు పైగా అవినీతి చేసినట్లు ఆరోపణలు రావడంతో పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. రైతులకు తెలియకుండానే వారి భూములపై లోన్లు తీసుకొని అక్రమాలకు పాల్పడిన పోలిరెడ్డిని బి.కోడూరు పోలీస్ స్టేషన్లో రహస్య విచారణ చేస్తున్నారు. 2005 నుంచి 2022 వరకు సొసైటీ ఛైర్మన్‌గా ఆయన కొనసాగారు.


