News December 9, 2025

పూజాగదిలో తప్పనిసరిగా నీళ్లు ఎందుకు ఉండాలి?

image

పూజా గదిలో ఏదైనా ఓ పాత్రలో నీటిని తప్పక ఉంచాలని పండితులు సూచిస్తారు. తద్వారా దేవతలు సంతృప్తి చెందుతారని అంటారు. ‘మహా నైవేద్యం కంటే కూడా నీటిని ఉంచి ప్రార్థించడం ద్వారా దేవతలు ఎక్కువ సంతోషిస్తారు. రాగి చెంబులో ఉంచిన మంచి నీరు మంత్ర శక్తి చేరిన జలంతో సమానం. ఆ నీరు ఆరోగ్యం, ఆనందాన్ని ఇస్తుంది. ఈ నీటిని రెండ్రోజులకోసారి మార్చాలి. ఫలితంగా ఇంట్లో రుణ శక్తి దూరమై, దైవశక్తి పెరుగుతుంది’ అని చెబుతున్నారు.

Similar News

News January 19, 2026

నితిన్ నబీన్ ఎంపిక వెనుక వ్యూహం ఇదేనా?

image

BJP జాతీయ అధ్యక్షుడిగా 46 ఏళ్ల నితిన్ నబీన్ ఎంపిక వెనుక స్పష్టమైన రాజకీయ వ్యూహం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. పార్టీలో యువ నాయకత్వానికి సంకేతం ఇవ్వడంతో పాటు యువతను ఆకర్షించడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వివాద రహితుడిగా, PM మోదీ, అమిత్ షాకు నమ్మకమైన వ్యక్తిగా ఆయనకు పేరుంది. నబీన్ అధ్యక్షతన 2029 లోక్‌సభ ఎన్నికలకు బీజేపీ సిద్ధం కానుంది.

News January 19, 2026

అగాథం నుంచి అగ్రస్థానానికి తెచ్చాం: CM

image

తాము అధికారంలోకి వచ్చేనాటికి రాష్ట్రం అగాథంలో కూరుకుపోయిందని దావోస్ పర్యటనలో AP CM CBN అన్నారు. ‘రాష్ట్ర పరిస్థితిని చూసిన వారంతా దాన్ని బాగు చేయగలుగుతారా? అని సందేహించారు. అసాధ్యమనీ అన్నారు. దిగిన తర్వాత ఎంత అగాథంలోకి వెళ్లిందో అర్థమైంది. అలాంటి రాష్ట్రాన్ని18 నెలల్లో నంబర్ 1 బ్రాండ్‌గా తయారుచేశాం. ఈజ్ ఆఫ్ డూయింగ్ కాకుండా స్పీడ్ ఆఫ్ డూయింగ్‌లో వెళ్లాం. 25 కొత్త పాలసీలు తెచ్చాం’ అని తెలిపారు.

News January 19, 2026

వెకేషన్‌లో నయన్- త్రిష.. 40ల్లోనూ తగ్గని గ్లామర్!

image

స్టార్ హీరోయిన్లు నయనతార, త్రిష మధ్య విభేదాలు ఉన్నాయంటూ గత కొంతకాలంగా వినిపిస్తున్న రూమర్లకు ఈ ఫొటోలతో చెక్ పడింది. దుబాయ్‌లో ఒక లగ్జరీ బోట్‌పై చిల్ అవుతున్న ఫొటోలను నయన్ షేర్ చేశారు. ‘ముస్తఫా ముస్తఫా don’t worry ముస్తఫా.. కాలం నీ నేస్తం ముస్తఫా’ అని రాసుకొచ్చారు. 40 ఏళ్లు దాటినా వీరి గ్లామర్ ఏమాత్రం తగ్గలేదని, ఇప్పటికీ డ్రీమ్ గర్ల్స్‌లా మెరిసిపోతున్నారని నెటిజన్లు కొనియాడుతున్నారు.