News April 10, 2025

పూలే, అంబేడ్కర్ జయంతిని ఘనంగా నిర్వహించాలి: కలెక్టర్

image

మహాత్మా జ్యోతిరావు పూలే, డా. B.R అంబేడ్కర్‌ జయంతి వేడుకలను జిల్లా కేంద్రంలో ఘనంగా నిర్వహించాలని పార్వతీపురం జిల్లా క‌లెక్ట‌ర్ శ్యామ్ ప్ర‌సాద్‌ ఆధికారులను ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఈనెల 11న పూలే, 14న అంబేడ్కర్ జయంతి వేడుకలను నిర్వహించనున్నట్లు చెప్పారు. ఈ వేడుకల్లో జిల్లా అధికారులతో పాటు ప్రజలు భాగస్వాములు కావాలన్నారు. గురువారం సంబంధిత అధికారులతో కలెక్టరేట్లో సమీక్షించారు.

Similar News

News January 23, 2026

ఈ రోజు నమాజ్ వేళలు (జనవరి 23, శుక్రవారం)

image

♦︎ ఫజర్: తెల్లవారుజామున 5.34 గంటలకు ♦︎ సూర్యోదయం: ఉదయం 6.49 గంటలకు ♦︎ దుహర్: మధ్యాహ్నం 12.28 గంటలకు ♦︎ అసర్: సాయంత్రం 4.30 గంటలకు ♦︎ మఘ్రిబ్: సాయంత్రం 6.06 గంటలకు ♦︎ ఇష: రాత్రి 7.22 గంటలకు ➤ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

News January 23, 2026

పిట్లం: గురువు ఉదారత.. అనాథ బాలుడికి విద్యాదాత!

image

తల్లిదండ్రులను కోల్పోయి అనాథగా మారిన ఓ విద్యార్థికి నేనున్నానంటూ భరోసానిచ్చారు తిమ్మానగర్ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు నారాయణ. పిట్లం (M) తిమ్మానగర్ MPUPSలో బోండ్ల ప్రణయ్ 7వ తరగతి చదువుతున్నాడు. అతడి తండ్రి మూడేళ్ల క్రితం, తల్లి అంబవ్వ ఇటీవల క్యాన్సర్‌తో మరణించారు. అనాథగా మారి, దిక్కుతోచని స్థితిలో ఉన్న ప్రణయ్‌ను ఆయన ఉన్నతాధికారుల వద్దకు తీసుకెళ్లి, గురుకుల పాఠశాలలో సీటు, హాస్టల్ వసతి కల్పించారు.

News January 23, 2026

కడప: Way2News ఎఫెక్ట్ VRO సస్పెండ్

image

చెన్నూరు మండలం రామనపల్లి<<18926711>> VRO<<>> వేణుగోపాల్‌ను సస్పెండ్ చేస్తూ కడప కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి ఉత్తర్వులు జారీ చేశారు. గ్రామ రెవెన్యూ అధికారిగా విధులు నిర్వర్తిస్తున్న వేణు గోపాల్‌పై అందిన లైంగిక వేధింపుల ఫిర్యాదు మేరకు క్రమశిక్షణ చర్యల్లో భాగంగా VROను సస్పెండ్ చేస్తూ గురువారం కలెక్టర్ ఉత్తర్వులిచ్చారు.