News February 17, 2025

పెండింగ్ కేసులను త్వరగా పరిష్కరించండి: వరంగల్ సీపీ

image

వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఆస్తి నేరాలకు సంబంధించిన కేసులను అధికారులు త్వరగా పరిష్కరించాలని సీపీ అంబర్ కిషోర్ ఝా ఆదేశించారు. ప్రధానంగా గతంలో ఇలాంటి నేరాలకు పాల్పడిన నేరస్థుల వివరాలను సేకరించి ప్రస్తుత వారి స్థితిగతులపై పోలీసులు దృష్టి పెట్టాలని సూచించారు. దొంగతనం కేసులను త్వరగా పరిష్కరించిన అధికారులకు సీపీ అభినందనలు తెలిపారు.

Similar News

News March 15, 2026

FLASH.. జమ్మికుంటలో రైలు పట్టాలపై తెగిపడిన తల

image

జమ్మికుంట రైల్వే స్టేషన్ సమీపంలో గుర్తుతెలియని ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సుమారు 35 సంవత్సరాల వయస్సు ఉన్న ఈ వ్యక్తి రైల్వే పట్టాలపై తలపెట్టి పడుకోవడంతో రైలు దూసుకెళ్లి తల, శరీరం వేర్వేరుగా పడిపోయాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి కేసు నమోదు చేశారు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది.

News March 15, 2026

16న కలెక్టరేట్‌లో PGRS

image

సోమవారం ఉ.10-మ.2 గంటల వరకు కలెక్టరేట్‌లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్) కార్యక్రమం నిర్వహించనున్నట్లు కలెక్టర్ డా.ఎస్.వెంకటేశ్వర్ తెలిపారు. ప్రజలు తమ సమస్యలను అర్జీల రూపంలో ఇవ్వొచ్చన్నారు. అర్జీల స్థితిపై 1100 నంబర్‌కు కాల్ చేయవచ్చని, అర్జీలు Meekosam.ap.gov.in వెబ్‌సైట్‌లో నమోదు చేసుకోవచ్చని చెప్పారు.

News March 15, 2026

సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్న RCB క్రికెటర్!

image

RCB కీలక బౌలర్ యశ్ దయాల్ సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్నట్లు సమాచారం. ఫిబ్రవరి 4న కంటెంట్ క్రియేటర్ శ్వేతా పుండీర్‌తో వివాహం జరిగినట్లు తాజాగా క్రీడా వర్గాలు తెలిపాయి. కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్యే అతడికి పెళ్లి జరిగినట్లు తెలుస్తోంది. మైనర్‌పై లైంగిక దాడికి పాల్పడినట్లు అతడిపై కేసు ఉన్న విషయం తెలిసిందే. రాజస్థాన్ హైకోర్టు యశ్‌కు అరెస్ట్ నుంచి రక్షణ కల్పించింది.