News April 2, 2024

పెదకూరపాడులో 30 మంది వాలంటీర్లు రాజీనామా

image

మండల వ్యాప్తంగా సుమారు 30 మంది వాలంటీర్లు తమ వాలంటరీ పోస్టులకు రాజీనామా చేసినట్లు ఎంపీడీవో మల్లేశ్వరి తెలిపారు. మండల వ్యాప్తంగా సోమవారం పొడపాడు, హుస్సేనగరం, ముసాపురం, పెదకూరపాడు పరిసర ప్రాంతాల్లోని వాలంటీర్లు స్వచ్ఛందంగా తమ వాలంటరీ పోస్ట్‌లకు రాజీనామా తెలిపినట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తమపై ఉంచిన నమ్మకాన్ని ఎలక్షన్ల సమయంలో అవ్వ తాతలకు అందించలేకపోయామనే బాధతో రాజీనామా చేస్తున్నామని తెలిపారు.

Similar News

News February 18, 2026

60 రోజుల్లోగా చార్జ్‌షీట్లు దాఖలు చేయాలి: ఎస్పీ

image

గుంటూరు జిల్లాలో నమోదైన క్రిమినల్ కేసుల విచారణను వేగవంతం చేయాలని SP వకుల్ జిందాల్ పోలీసు అధికారులను ఆదేశించారు. బుధవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడుతూ.. 60 నుంచి 90 రోజులలోపు చార్జ్ షీట్లను న్యాయస్థానంలో దాఖలు చేయాలన్నారు. ఆస్తి నేరాల నివారణకు సీసీ కెమెరాల ఏర్పాటు, రాత్రి గస్తీని బలోపేతం చేయాలని సూచించారు. పెండింగ్ కేసుల పరిష్కారానికి ప్రత్యేక దృష్టి సారించాలని స్పష్టం చేశారు.

News February 18, 2026

గుంటూరు: కాంట్రాక్టర్లపై క్రిమినల్ చర్యలకు కలెక్టర్ ఆదేశాలు

image

ఇళ్ల నిర్మాణాల్ని మధ్యలోనే ఆపేసిన కాంట్రాక్టర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని మంగళవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో గుంటూరు కలెక్టర్ తమీమ్ అన్సారీయా అధికారులను ఆదేశించారు. ఉగాది నాటికి జిల్లాలో 22,952 గృహాల లక్ష్యం పూర్తి చేసేందుకు ప్రత్యేక శ్రద్ధ వహించాలని స్పష్టం చేశారు. ఉపాధి హామీలో పనులు చేసుకోవచ్చన్నారు. బిల్లుల చెల్లింపు వెంటనే జరుగుతుందని లబ్ధిదారులకు అవగాహన కల్పించాలన్నారు.

News February 18, 2026

పోక్సో కేసులో అసెంబ్లీ ASO మునిరాజా అరెస్ట్

image

AP అసెంబ్లీ ఉద్యోగి ASO మునిరాజా తండ్రిలా దరిచేరి బాలికపై అత్యాచారయత్నం చేశాడు. లైంగిక దాడి, కుల దూషణ కేసులో అరెస్ట్ చేసినట్లు నున్న పోలీసులు వెల్లడించారు. విజయవాడకు చెందిన భర్త లేని ఓ తల్లి, ఆమె కూతురిని 2 ఏళ్లుగా ఆర్థికంగా, మానసికంగా మునిరాజా వేధించడం, బాలిక దుస్తుల మార్చుకునే దృశ్యాలు చిత్రీకరించినట్లు విచారణలో తేలింది. ఈయన వెలగపూడిలోని AP అసెంబ్లీలో పనిచేస్తూ తాడేపల్లిలో నివాసం ఉంటున్నాడు.