News February 3, 2025

పెదబయలు సంతలో క్యారెట్ ధర పతనం

image

పెదబయలు మండల కేంద్రంలోని సోమవారం వారపు సంతలో క్యారెట్ ధర పతనమైంది. కొనుగోలుదారులు లేక రైతులు దిగాలు చెందారు. ఒడిశా ప్రాంతం నుంచి సంతకు అధికంగా వచ్చే కూరగాయల వ్యాపారస్థులు ప్రస్తుతం ధరలు పతనం అవ్వడంతో మరల వెనక్కి తీసుకెళ్లలేక తక్కువ ధరలకు విక్రయిస్తున్నారని వాపోతున్నారు. గత వారం రూ.1250 పలికిన బుట్ట క్యారెట్ ధర ఈ వారం రూ.900 నుంచి రూ.950 పలుకుతుందన్నారు.

Similar News

News January 25, 2026

ఆదివారం రోజున మాంసాహారం తింటున్నారా?

image

ఆదివారమొస్తే చాలామంది మాంసాహారం తింటుంటారు. కానీ శాస్త్రాలు అది తప్పని చెబుతున్నాయి. ఎందుకంటే ఇది సూర్యుడికి అంకితమైన రోజు. ఆయన ఆరోగ్యానికి, సాత్విక శక్తికి కారకుడు. ‘స్త్రీ తైల మధు మాంసాని రవివారే విసర్జయేత్’ అనే శ్లోకం ప్రకారం ఈరోజు మాంసం తినకూడదు. ఇది మన శరీరంలో తామస గుణాన్ని పెంచుతుంది. సూర్యుని సాత్విక శక్తిని గ్రహించకుండా అడ్డుకుంటుంది. ఆత్మశుద్ధి, దీర్ఘాయువు కోసం ఈ నియమాలు పాటించాలి.

News January 25, 2026

NRPT: సంక్షేమ పథకాలపై ‘విలేజ్ విజిట్’ సర్వే: కలెక్టర్

image

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలకు అందుతున్నాయా లేదా అనే విషయాలను ఆల్ ఇండియా సర్వీసెస్ మిలిటరీ ఇంజినీరింగ్ సర్వీసెస్ విలేజ్ విజిట్ ప్రోగ్రాం ద్వారా సోషల్ ఎకనామిక్ అండ్ డెవలప్మెంట్ స్కీం సర్వే నిర్వహిస్తారని కలెక్టర్ సిక్తా పట్నాయక్ తెలిపారు. శనివారం నారాయణపేట కలెక్టరేట్‌లో అధికారులతో సమావేశం నిర్వహించారు. ఎంపిక చేసిన నాలుగు గ్రామాల్లో సర్వే చేస్తారని అన్నారు.

News January 25, 2026

బాలల సంరక్షణకు శాఖల సమన్వయం అవసరం: కలెక్టర్ వెట్రిసెల్వి

image

బాలల సంరక్షణకు సంబంధించి అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి సూచించారు. శనివారం ఏలూరు కలెక్టరేట్‌లో జిల్లా స్థాయి బాలల సంక్షేమం-సంరక్షణ కమిటీ సమావేశంలో బాలల రక్షణపై అధికారులతో ఆమె సమీక్షించారు. ఆదరణ అవసరమైన బాలలు, చట్టంతో విభేదించిన బాలలు, జువెనైల్ జస్టిస్ కేర్ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ యాక్ట్‌లోకి వచ్చే పిల్లల సంరక్షణపై అధికారులు శ్రద్ద చూపాలన్నారు.