News November 19, 2025

పెద్దపల్లి: అభయ హస్తం పథకానికి ఈనెల 21 వరకు గడువు.!

image

రాజీవ్ గాంధీ సివిల్స్ అభయ హస్తం పథకం కింద రూ.లక్ష రూపాయల ప్రోత్సాహం కోసం అర్హులైన అభ్యర్థులు ఈ నెల 21లోపు దరఖాస్తు చేసుకోవాలని సింగరేణి సీఎండీ బలరాం మంగళవారం ప్రకటించారు. అభ్యర్థుల విజ్ఞాపనల మేరకు మరోసారి దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించినట్లు తెలిపారు. అభ్యర్థులు హైదరాబాద్‌లోని సింగరేణి భవన్‌లో దరఖాస్తులను సమర్పించాలని ఆయన సూచించారు.

Similar News

News January 19, 2026

నిర్మల్: ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోండి

image

ఉమ్మడి జిల్లా చించోలి-బిలోని దుర్గాబాయి మహిళా శిశు వికాస కేంద్రంలో టైలరింగ్, కమ్యూనిటీ హెల్త్ వర్కర్, బ్యూటీషియన్ కోర్సుల్లో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు జిల్లా మేనేజర్ విజయలక్ష్మి తెలిపారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన 15 నుంచి 35 ఏళ్ల లోపు మహిళలు అర్హులని పేర్కొన్నారు. ఆసక్తి గలవారు ఈ నెల 31 లోపు దరఖాస్తు చేసుకోవాలని, వివరాలకు 9848255529, 7660022506 నంబర్లను సంప్రదించాలని కోరారు.

News January 19, 2026

రాజధాని రైతులకు శుభవార్త

image

అమరావతి రాజధాని కోసం భూములిచ్చిన రైతులకు ఈ నెల 23న ఈ-లాటరీ ద్వారా ప్లాట్లను కేటాయించనున్నట్లు మంత్రి నారాయణ ప్రకటించారు. సీఆర్డీఏకు భూములిచ్చి, ఇప్పటికీ ప్లాట్లు పెండింగ్‌లో ఉన్న వారికి ఈ ప్రక్రియ ద్వారా న్యాయం జరుగుతుందని తెలిపారు. ప్లాట్లు పొందిన వెంటనే రైతులకు రిజిస్ట్రేషన్ చేసేలా అన్ని చర్యలు తీసుకున్నామని మంత్రి స్పష్టం చేశారు.

News January 19, 2026

‘ది లయన్ కింగ్’ కో డైరెక్టర్ కన్నుమూత

image

యానిమేటెడ్ మూవీ ‘ది లయన్ కింగ్’(1994) కో-డైరెక్టర్ రోజర్ అల్లర్స్(76) మరణించారు. శాంటా మోనికాలోని తన నివాసంలో అనారోగ్యంతో మరణించినట్లు సన్నిహిత వర్గాలు తెలిపాయి. ప్రముఖ నిర్మాణ సంస్థ డిస్నీలో పలు చిత్రాలకు పని చేశారు. అలాద్దీన్(1992), ఓలివర్&కంపెనీ(1988), బ్యూటీ&ది బీస్ట్ వంటి చిత్రాలకు వర్క్ చేశారు. ఆయన మరణంపై డిస్నీ CEO బాబ్ ఇగర్ విచారం వ్యక్తం చేశారు. వెటరన్ దర్శకుడికి నివాళులు అర్పించారు.