News September 12, 2025

పెద్దపల్లి: ఆమెకు 120 ఏళ్లు..!

image

పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం కనగర్తి గ్రామానికి చెందిన తాళ్లపల్లి పోచమ్మకు 120 ఏళ్ల వయసు అని, ఇప్పటికీ ఆరోగ్యంగా ఉందని స్థానికులు తెలిపారు. ఆమెకు ఐదుగురు కొడుకులు, ఐదుగురు బిడ్డలు, మనవళ్లు, మనవరాళ్లు, ముని మనవళ్లు, ముని మనవరాళ్లు ఉన్నారని చెప్పారు. నేటి కాలం ప్రజలకు ఆమె ఆదర్శమంటూ మాదిగ మిత్ర మండలి ఉపాధ్యక్షుడు కోటగిరి పాపయ్య, దుర్గయ్య, రామస్వామి, సమ్మయ్య, రాజు తదితరులు కలిసి పోచమ్మను సన్మానించారు.

Similar News

News December 17, 2025

నేడే మూడో విడత పోలింగ్

image

TG: పంచాయతీ ఎన్నికల చివరి విడత పోలింగ్‌కు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. ఇవాళ 3,752 సర్పంచ్, 28,410 వార్డు స్థానాలకు ఓటింగ్ జరగనుంది. సర్పంచ్ బరిలో 12,652 మంది, వార్డుల బరిలో 75,725 మంది తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. చివరి విడతలో 53,06,395 మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. మూడో విడత ఎన్నికల వేళ రూ.9.11 కోట్ల నగదు, మద్యం, మాదక ద్రవ్యాలను పోలీసులు సీజ్ చేశారు.

News December 17, 2025

గోదావరి జిల్లాల్లో మొదలైన సంక్రాంతి సందడి..!

image

గోదావరి జిల్లాల్లో సంక్రాంతి సందడి మొదలైపోయింది. పందెం రాయుళ్లు కోడి పందేలకు సిద్ధం అవుతున్నారు. ఈసారి రూ.కోట్లలో పందేలు జరగడం ఖాయం అనే వాదన బలంగా వినిపిస్తుంది. ఎక్కడ ఎలా బరులు ఏర్పాటు చెయ్యాలి..? ఎవరు ఎవరితో సిండికేట్ అవ్వాలి..? వీఐపీలు, పందెం కాసే వారికి ఎలాంటి మర్యాదలు చెయ్యాలి..? పందేల నిర్వహణ ఎలా జరపాలనే అంశాలపై పక్కా ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నట్లు పందెం రాయుళ్లు చర్చించుకుంటున్నారు.

News December 17, 2025

ధనుర్మాసం: రెండవరోజు కీర్తన

image

‘భాగ్యవంతులైన గోకుల గోపికలారా! ఈ ధనుర్మాస వ్రతంలో మన కర్తవ్యం నారాయణుని పాదాలను కీర్తించడం. వ్రత కాలంలో ఇతర విషయాలు తలవకుండా, పాలు, నేతిని తాగడం, కంటికి కాటుక, సిగలో పూలు ధరించడం వంటివి మానేయాలి. శాస్త్ర విరుద్ధ పనులు చేయరాదు. చాడీలు చెప్పవద్దు. సన్యాసులు, బ్రహ్మచారులకు దానాలు చేయాలి. మనకు మోక్షాన్ని ఇచ్చే ఇతర మార్గాలన్నీ సంతోషంగా ఆచరించాలి. ధనుర్మాసమంతా ఈ నియమాలనే పాటించాలి’. <<-se>>#DHANURMASAM<<>>