News March 13, 2025

పెద్దపల్లి: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విద్యా బోధన: విద్యాశాఖ

image

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విద్యా బోధనపై వీడియో కాన్ఫరెన్స్‌ను విద్యాశాఖ కార్యదర్శి నిర్వహించారు. మార్చి 15 నుంచి జిల్లాలలో ఎంపికచేసిన ప్రాథమిక ప్రభుత్వ పాఠశాలలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (కృత్రిమ మేధ)ను వినియోగిస్తూ సులభతరంగా విద్యాబోధన చేసేందుకు చర్యలు చేపట్టాలని విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణ ఆదేశించారు. 3-5వ తరగతి విద్యార్థులకు సామర్థ్యాల పెంపు లక్ష్యం అన్నారు. VCలో PDPL కలెక్టర్ పాల్గొన్నారు.

Similar News

News February 18, 2026

సారంగాపూర్: దుబ్బరాజన్న హుండీ లెక్కింపు పూర్తి

image

పెంబట్ల-కోనాపూర్ దుబ్బరాజేశ్వర స్వామి ఆలయ హుండీ లెక్కింపు బుధవారం జరిగినట్టు ఈఓ వి.అనూష తెలిపారు. టికెట్ల ద్వారా రూ.27,38,312=00, హుండీ ద్వారా రూ.21,27,684=00, వేలం ద్వారా రూ.12,71,000=00, మొత్తం రూ.61,36,996=00, గత సంవత్సరం కంటే రూ.1,43,008=00 అధికంగా సమకూరింది. మిశ్రమ బంగారం 33గ్రా.510మి.,మిశ్రమ వెండి 7.580 కి.గ్రా. సమకూరింది. ఈ కార్యక్రమంలో దేవాదాయశాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

News February 18, 2026

అన్నమయ్య: రంజాన్ వేళ.. ఉర్దూ మీడియం స్కూల్ వేళల్లో మార్పులు

image

రంజాన్ మాసం సందర్భంగా అన్నమయ్య జిల్లాలోని అన్ని ఉర్దూ మాధ్యమ పాఠశాలలు రేపు ఉదయం 8.00 నుంచి మధ్యాహ్నం 1.30 వరకు నిర్వహిస్తారని DEO సుబ్రమణ్యం తెలిపారు. ఈ సమయాలు రంజాన్ కాలానికి మాత్రమే వర్తిస్తాయి. పదో తరగతి యాక్షన్ ప్లాన్‌పై స్పష్టత వచ్చే వరకు స్లిప్ టెస్టులు యథావిధిగా నిర్వహించాలన్నారు. ముస్లిం ఉద్యోగులకు ప్రతిరోజూ ఒక గంట ముందుగా వెళ్లేందుకు అనుమతి ఇచ్చారు.

News February 18, 2026

ఈక్రాప్ నమోదును వేగంగా పూర్తి చేయాలి: నెల్లూరు కలెక్టర్

image

ఈ క్రాప్ నమోదును వేగంగా పూర్తిచేయాలని నెల్లూరు కలెక్టర్ హిమాన్షు శుక్లా వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. ఇందుకూరుపేట మండలం కొరుటూరు పంచాయతీలో ఆన్‌లైన్‌లో నమోదు చేసిన పంట వివరాలను కలెక్టర్ పరిశీలించారు. ఈ-పంట యాప్ నుంచి రైతుల వివరాలను డౌన్లోడ్ చేసుకొని నమోదు చేసేటప్పుడు ఆధార్ ఫోన్ నెంబర్ సరిచూడాలన్నారు. రైతు గండవరపు అమర్నాథ్ రెడ్డి, గ్రామ వ్యవసాయ సహాయకురాలు ఝాన్సీ పాల్గొన్నారు.