News March 5, 2025
పెద్దపల్లి: ఇంటర్ మొదటిరోజు పరీక్ష ప్రశాంతం

పెద్దపల్లి జిల్లాలో ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు మొదటి రోజు బుధవారం ప్రశాంతంగా జరిగాయని ఇంటర్మీడియట్ జిల్లా అధికారి కల్పన తెలిపారు. తెలుగు, హిందీ, ఉర్దూ భాష పరీక్షలు జరిగాయి అన్నారు. ఈ పరీక్షకు (5341) మంది హాజరుకావాల్సి ఉండగా, (5154)మంది హాజరు కాగా (187) మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని తెలిపారు. తొలి రోజు 96 % హాజరు నమోదయ్యిందన్నారు.
Similar News
News March 24, 2025
పార్లమెంట్ ప్రాంగణంలో అరకు కాఫీ స్టాళ్ల ఏర్పాటు

దేశ రాజధాని ఢిల్లీలోని పార్లమెంట్ ప్రాంగణంలో రెండు అరకు కాఫీ స్టాళ్లు ఏర్పాటయ్యాయి. అక్కడ ఎంపీలు అల్పాహారం తీసుకునే సంగం క్యాంటీన్‌లో గిరిజన కోఆపరేటివ్ సొసైటీ వీటిని ఏర్పాటు చేసింది. అరకు కాఫీకి బ్రాండ్ ఇమేజ్ తేవాలని AP సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు TDP ఎంపీలు కోరగా లోక్‌సభ స్పీకర్ అనుమతి ఇచ్చారు. ఇటీవల ఏపీ అసెంబ్లీలోనూ అరకు కాఫీ స్టాల్‌ను ప్రారంభించిన విషయం తెలిసిందే.
News March 24, 2025
కాస్త తగ్గిన బంగారం ధరలు

బంగారం ధరలు కాస్త తగ్గాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.150 తగ్గి రూ.82,150 వద్ద కొనసాగుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.160 తగ్గడంతో రూ.89,620కు చేరింది. అటు వెండి ధర కూడా రూ.100 తగ్గడంతో కేజీ సిల్వర్ రేటు రూ.1,09,900గా ఉంది. కాగా, మూడు రోజుల్లోనే 24 క్యారెట్ల తులం బంగారంపై రూ.1040 తగ్గడం గమనార్హం.
News March 24, 2025
5 స్టార్ ఏసీ వాడితే.. 60 శాతం కరెంట్ ఆదా

5 స్టార్ రేటెడ్ ACలు వాడితే 60% వరకు విద్యుత్ ఆదా అవుతుందని బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ(BEE) సౌత్ఇండియా మీడియా అడ్వైజర్ చంద్రశేఖర్ తెలిపారు. దేశంలో వాడుతున్న ACల్లో అత్యధికం 8ఏళ్ల కంటే పాతవని, ఇవి 40-50% విద్యుత్ అధికంగా వినియోగిస్తున్నట్లు అధ్యయనాలు చెప్పాయన్నారు. ACని 24°C వద్ద వాడటం ఉత్తమమన్నారు. 5స్టార్ రేటెడ్ ACలతో భూతాపాన్ని తగ్గించడంతో పాటు గ్రీన్ హౌజ్ గ్యాసెస్‌ని అరికట్టవచ్చని తెలిపారు.