News January 30, 2025

పెద్దపల్లి: ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తులు 1,80,664

image

పెద్దపల్లి జిల్లాలోని పేద ప్రజల సొంతింటి కలపై ఆశలు చిగురిస్తున్నా.. కొంత ఆందోళన కూడా కలుగుతోంది . నియోజకవర్గానికి 3,500 ఇళ్లను మంజూరు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. కానీ ఇళ్లను ఆశిస్తున్న వారు లక్షల్లో ఉన్నారు. ఇందిరమ్మ ఇళ్ల కోసం ఇప్పటివరకు ప్రజా పాలన గ్రామసభలో జిల్లావ్యాప్తంగా 1,80,664 దరఖాస్తులు వచ్చాయి.

Similar News

News February 19, 2025

మధురవాడ: మహిళ హత్య కేసులో నిందితుల అరెస్ట్

image

మధురవాడలో బుధవారం మరో సంచలనం చోటుచేసుకుంది. ఒడిశాలో ఓ మహిళను అతి కిరాతకంగా హత్య చేసి మధురవాడలో షెల్టర్ ఏర్పాటు చేసుకుని ఉంటున్న నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఒడిశా పోలీసులు టవర్ లొకేషన్ ఆధారంగా వారిని గుర్తించారు. వెంటనే పీఎంపాలెం పోలీసుల సహాయంతో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం పీఎంపాలెం పోలీసులు ఒడిశా పోలీసులకు వారిని అప్పగించారు.

News February 19, 2025

100% మళ్లీ అధికారంలోకి వస్తాం: కేసీఆర్

image

TG: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అన్నిరంగాల్లో విఫలమైందని బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ఆరోపించారు. తమ పార్టీ ఒక్కటే తెలంగాణ కోసం పోరాడగలదని, పార్టీ నేతలు ప్రజల కోసం పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. ప్రజల కష్టాలు బీఆర్ఎస్‌కు మాత్రమే తెలుసని చెప్పారు. వందశాతం మళ్లీ అధికారంలోకి వస్తామని తెలంగాణ భవన్‌లో జరిగిన విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశంలో కేసీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు.

News February 19, 2025

APPLY.. రూ.55,000 జీతంతో ఉద్యోగాలు

image

ఎన్టీపీసీలో 400 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి దరఖాస్తుల స్వీకరణ కొనసాగుతోంది. మార్చి 1 వరకు అప్లై చేసుకునేందుకు అవకాశం ఉంది. బీఈ/బీటెక్ చేసిన వారిని అర్హులుగా పేర్కొంది. రిజర్వేషన్‌ను బట్టి వయో సడలింపు ఉంది. శాలరీ గరిష్ఠంగా రూ.55,000 వరకు ఉంటుంది. రాత పరీక్ష, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా ఎంపిక చేస్తారు.
వెబ్‌సైట్: www.ntpc.co.in.

error: Content is protected !!