News August 13, 2025
పెద్దపల్లి: ‘ఉపాధ్యాయులు కృషి చేయాలి’

పెద్దపల్లి మండలం నిమ్మపల్లిలోని మండల పరిషత్ ప్రైమరీ స్కూల్, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను కలెక్టర్ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థుల ఇంగ్లీష్ రీడింగ్ స్కిల్ బాగున్నా, అర్థం చేసుకోవడంలో వెనుకబడి ఉన్నారని, కాంప్రహెన్షన్ స్కిల్ పెంపుపై ఉపాధ్యాయులు శ్రద్ధ పెట్టాలని సూచించారు. 140 ఇండ్లలో 45 మాత్రమే గ్రౌండ్ కావడం పై కారణాలు తెలుసుకొని, పనులు వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
Similar News
News March 7, 2026
Way2News ప్రజాగళం.. వాట్సాప్ నంబర్ సేవ్ చేసుకోండి!

ప్రజా గొంతుకగా Way2News నిలుస్తోంది. మీ గ్రామ, మండల, జిల్లా స్థాయిలో నెలకొన్న ప్రజా సమస్యలు, అక్రమాలు, అవినీతి, భూకబ్జాలు, ఇతర మోసాలపై మీరు ఎప్పటికప్పుడు Way2News ప్రజాగళం TG వాట్సాప్ నంబర్ 7995975252కు ఫొటోలు, వీడియోలతో కూడిన సమాచారాన్ని పంపించవచ్చు. వాటిని ప్రభుత్వ యంత్రాంగానికి తెలిసేలా పబ్లిష్ చేసి, పరిష్కారానికి కృషి చేస్తాం.
గమనిక: ఈ నంబర్ వాట్సాప్‌కు మాత్రమే, ఫోన్ కాల్ పనిచేయదు.
News March 7, 2026
అమలాపురం: పోలీసుల ‘ఆపరేషన్ వజ్రప్రహార్’

అంబేడ్కర్ కోనసీమ జిల్లావ్యాప్తంగా శనివారం పోలీసులు భారీ స్థాయిలో కార్డెన్ అండ్ సెర్చ్ నిర్వహించారు. SP రాహుల్ మీనా ఆదేశాలతో అమలాపురం, రావులపాలెం, పామర్రు ప్రాంతాల్లో ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు. అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపుతూ, నేరస్థుల ఆటకట్టించడానికి ఏకకాలంలో ఈ ఆపరేషన్ నిర్వహించారు. ప్రజా భద్రతను పటిష్టం చేయడమే లక్ష్యంగా కీలక ప్రాంతాలను పోలీసులు దిగ్బంధించి సోదాలు జరిపారు.
News March 7, 2026
నిప్పుల కుంపటిలా నాగర్ కర్నూల్

జిల్లాలో వేసవి ఆరంభంలోనే ఎండలు మండిపోతున్నాయి. గడిచిన 24 గంటల్లో పెంట్లవెల్లి మండలం జటప్రోలులో అత్యధికంగా 38.5°C ఉష్ణోగ్రత నమోదైంది. యంగంపల్లి, తిమ్మాజీపేటలో 38.4°C, ఊర్కొండలో 38.2°C గా రికార్డయ్యాయి. భానుడి భగభగలకు జిల్లా ప్రజలు విలవిల్లాడుతున్నారు. మధ్యాహ్నం వేళ బయటకు వచ్చే వారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.


