News November 8, 2025
పెద్దపల్లి: గడ్డి మందు తాగి వ్యక్తి మృతి

పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం జీలకుంట గ్రామానికి చెందిన దండు రాజు(47) గడ్డి మందు తాగి మరణించాడు. హమాలీ పనులు చేస్తూ మద్యానికి బానిసైన రాజు నిన్న మధ్యాహ్నం మద్యం మత్తులో గడ్డి మందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు అతడిని వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ ఇవాళ ఉదయం మృతిచెందాడు. మృతుడి భార్య రాజేశ్వరి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్ఐ కిషన్ తెలిపారు.
Similar News
News January 23, 2026
ASF: మెడికల్ ల్యాబ్‌ల పేరిట దోపిడీ

జిల్లాలో అక్రమ మెడికల్ ల్యాబ్‌ల దందా విచ్చలవిడిగా సాగుతోంది. అర్హత లేకున్నా రక్త పరీక్షల కేంద్రాలు నిర్వహిస్తూ ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారు. ఒక్కో పరీక్షకు ఒక్కో ధర వసూలు చేస్తున్నారు. కొంతమంది వైద్యులు కమీషన్ల కోసం అవసరం లేకున్నా రోగులను ఈ ల్యాబ్‌లకు పంపిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అధికారులు తనిఖీలు చేపట్టకపోవడంతో ఈ అక్రమ వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్ధిల్లుతోంది.
News January 23, 2026
అట్రాసిటీ కేసుల దర్యాప్తు వేగవంతం చేయాలి: కలెక్టర్

ఆదిలాబాద్ కలెక్టరేట్‌లో జిల్లా స్థాయి విజిలెన్స్, మానిటరింగ్ కమిటీ సమావేశం కలెక్టర్ రాజర్షి షా అధ్యక్షతన జరిగింది. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల పురోగతిని సమీక్షించిన ఆయన, విచారణను వేగవంతం చేసి బాధితులకు త్వరితగతిన న్యాయం అందించాలని అధికారులను ఆదేశించారు. బాధితులకు అందాల్సిన పరిహారాన్ని సకాలంలో అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో ఎస్సీ అభివృద్ధి శాఖ అధికారులు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
News January 23, 2026
వరల్డ్ కప్‌కు రోహిత్ కెప్టెన్సీ? మాజీ క్రికెటర్ రెస్పాన్స్ ఇదే..

టీమ్ ఇండియా వన్డే కెప్టెన్‌గా శుభ్‌మన్ గిల్ ఫెయిల్ అవుతున్నారని మాజీ క్రికెటర్ మనోజ్ తివారీ అభిప్రాయపడ్డారు. గిల్ నాయకత్వంలో AUS, NZతో జరిగిన సిరీస్‌లను భారత్ కోల్పోవడంతో అతణ్ని కెప్టెన్సీ నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. 2027 వరల్డ్ కప్ కోసం మళ్లీ రోహిత్ శర్మకే పగ్గాలు అప్పగించాలని BCCIకి సూచించారు. రోహిత్ ఉంటే ఫలితాలు మరోలా ఉండేవని, ఈ మార్పు వెంటనే జరగాలని అభిప్రాయపడ్డారు.


