News November 7, 2025

పెద్దపల్లి: చిట్టీలు వేస్తున్నారా..? జర జాగ్రత్త..!

image

అధిక లాభాలు వస్తాయని నమ్మబలికి చిట్టీల పేరుతో ప్రజల వద్ద నుంచి డబ్బులు వసూలు చేసిన పెద్దపల్లి భరత్‌నగర్‌కు చెందిన ఠాకూర్ హనుమాన్ ప్రసాద్‌ను PDPL టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. సుమారు 40 మందిని మోసగించి, గత డిసెంబర్‌ నుంచి పరారీలో ఉన్న అతడిని ప్రత్యేక బృందం పట్టుకుంది. రిమాండ్‌కు హాజరుపరచనున్నట్లు SI లక్ష్మణ్ రావు తెలిపారు. ఇంకా అతడి బాధితులు ఎవరైనా ఉంటే పోలీస్ స్టేషన్‌లో సంప్రదించాలని సూచించారు.

Similar News

News January 20, 2026

భక్తులకు TTD గుడ్ న్యూస్.. ఇక రెండుపూటలా అన్నప్రసాదం!

image

AP: CM చంద్రబాబు ఆదేశాల మేరకు మార్చి నెలాఖరు నుంచి TTD పరిధిలోని అన్ని ఆలయాల్లో భక్తులకు రెండుపూటలా అన్నప్రసాదం అందించనున్నట్లు EO అనిల్‌కుమార్‌ సింఘాల్‌ తెలిపారు. మొత్తం 56 ఆలయాల్లో ఈ సౌకర్యం అందుబాటులోకి రానుంది. వీటితో పాటు ఖాళీగా ఉన్న AE పోస్టుల భర్తీకి ఏప్రిల్‌లో ఎగ్జామ్స్ నిర్వహించాలని, కొత్తగా ఎంపికైన వేద పారాయణదారులకు నియామక పత్రాలు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.

News January 20, 2026

అర్హులైన ప్రతి మహిళకు ప్రభుత్వ పథకాలు చేరాలి: డిప్యూటీ సీఎం

image

కలెక్టరేట్ నుంచి రాష్ట్ర మంత్రులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్, అదనపు కలెక్టర్ అనిల్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. పట్టణ మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాల మంజూరులో జాప్యం జరగకూడదని ఆదేశించారు. అలాగే ఇందిరమ్మ చీరల పంపిణీ ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. ప్రభుత్వ పథకాలు అర్హులైన ప్రతి మహిళకు చేరాలన్నారు.

News January 20, 2026

దావోస్‌లో నారా లోకేశ్ న్యూ లుక్

image

పెట్టుబడులే లక్ష్యంగా AP CM చంద్రబాబు బృందం దావోస్‌లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. మంత్రి లోకేశ్ కూడా ఈ బృందంలో సభ్యుడిగా ఉన్నారు. ఈ పర్యటనలో ఆయన కూడా పెట్టుబడిదారులతో విస్తృతంగా సమావేశమవుతున్నారు. APలో పెట్టుబడులు పెట్టాలని ఇన్వెస్టర్స్‌ని ఆహ్వానిస్తున్నారు. అయితే ఆయన ఈసారి కొత్తగా టీ షర్ట్‌లో కనిపించారు. దీంతో న్యూలుక్ ఫొటోలు SMలో వైరలవుతున్నాయి. పైగా ఆయన కాస్త స్లిమ్‌గా కూడా కనిపిస్తున్నారు.