News March 10, 2025

పెద్దపల్లి జిల్లాకు రూ.200 కోట్లు..!

image

యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ స్కూల్స్‌కు నిధులు మంజూరు చేస్తూ ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆదివారం ఉత్తర్వులు విడుదల చేశారు. సువిశాల స్థలంలో ఇంటర్నేషనల్ స్థాయి విద్యకు దీటుగా పాఠశాలలు నిర్మిస్తున్నామన్నారు. ఇక్కడి విద్యార్థులు ప్రపంచంతో పోటీపడుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. పెద్దపల్లి జిల్లాలోని మంథనికి రూ.200కోట్లు మంజూరు చేశారు.

Similar News

News July 8, 2025

బుధవారం వరంగల్ మార్కెట్ బంద్.. ఎందుకంటే?

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ బుధవారం బంద్ ఉండనున్నట్లు వరంగల్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు తెలిపారు. కేంద్ర, రాష్ట్ర కార్మిక సంఘాల పిలుపుమేరకు బుధవారం జరిగే సమ్మెలో మార్కెట్ కార్మికులు పాల్గొంటారని చెప్పారు. కార్మికుల విజ్ఞప్తి మేరకు బుధవారం మార్కెట్‌కు సెలవు ప్రకటిస్తున్నట్లు సోమవారం పత్రిక ప్రకటన విడుదల చేశారు.

News July 8, 2025

పెద్దపల్లి: ‘అర్జీలు పెండింగ్‌లో ఉంచకుండా పరిష్కరించాలి’

image

ప్రజావాణి దరఖాస్తులకు అత్యంత ప్రాధాన్యమిచ్చి పెండింగ్‌లో ఉంచకుండా వాటిని పరిష్కరించాలని కలెక్టర్‌ కోయ శ్రీ హర్ష సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం ప్రజావాణి సందర్భంగా ఆయన సమీకృత జిల్లా కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్‌ డీ.వేణుతో కలిసి ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. ఈ సందర్భంగా పలువురు తమ సమస్యలపై దరఖాస్తులను సమర్పించారు. ఈ ప్రజావాణిలో సంబంధిత జిల్లా అధికారులు ఉన్నారు.

News July 8, 2025

గ్రామీణ ఉపాధిపై దృష్టి: కలెక్టర్

image

జిల్లాలో ఆదాయ సృష్టి, గ్రామీణ ఉపాధిపై కల్పనపై దృష్టి సారించి వివిధ శాఖల సమన్వయంతో స్పష్టమైన కార్యాచరణ ప్రణాళికలను రూపొందిస్తున్నామని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు. సోమవారం కలెక్టర్ అధ్యక్షతన జిల్లా స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ మేరకు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కెపాసిటీ బిల్డింగ్, ట్రైనింగ్, వ్యవసాయ విస్తరణ, లైవ్ స్టాక్ వంటి అంశాలపై చర్చించారు. అధికారులు పాల్గొన్నారు.