News February 6, 2025

పెద్దపల్లి జిల్లాలో ఉష్ణోగ్రత వివరాలు..

image

పెద్దపల్లి జిల్లాలో రోజురోజుకు చలి తీవ్రత తగ్గుముఖం పడుతుంది. గడచిన 24 గంటల్లో అత్యల్పంగా సుల్తానాబాద్ 18.0℃, రామగుండం 18.3, ఓదెల 18.3, కాల్వ శ్రీరాంపూర్ 18.6, మంథని 18.7, అంతర్గం 18.8, పాలకుర్తి 18.9, ఎలిగేడు 19.2, జూలపల్లి 19.2, ధర్మారం 19.7, పెద్దపల్లి 19.7, కమాన్పూర్ 20.4, రామగిరి 21.9, ముత్తారం 22.1℃గా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

Similar News

News January 23, 2026

364 పోస్టులకు నోటిఫికేషన్

image

యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ 364 అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. బీఈ, బీటెక్, డిగ్రీ(BA,BCom,BBA,LLB), డిప్లొమా, ఐటీఐ అర్హత గల అభ్యర్థులు ఫిబ్రవరి 1 నుంచి 28 వరకు NATS/NAPS పోర్టల్‌లో అప్లై చేసుకోవచ్చు. వయసు 18 నుంచి 25ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. అకడమిక్ మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://www.uraniumcorp.in

News January 23, 2026

ఖమ్మం మార్కెట్‌కు వరుసగా మూడు రోజులు సెలవులు

image

ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు వరుసగా మూడు రోజుల పాటు సెలవులు ప్రకటిస్తున్నట్లు మార్కెట్ కమిటీ అధికారులు తెలిపారు. శని, ఆదివారాలు వారాంతపు సెలవులతో పాటు, సోమవారం (జనవరి 26) గణతంత్ర దినోత్సవం సందర్భంగా మార్కెట్ మూసివేయనున్నారు. తిరిగి మంగళవారం నుండి కొనుగోళ్లు యథావిధిగా ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. కావున రైతులు సెలవు రోజుల్లో తమ పంట ఉత్పత్తులను మార్కెట్‌కు తీసుకురావద్దని అధికారులు విజ్ఞప్తి చేశారు.

News January 23, 2026

KTR విచారణ.. BRS విరాళాలపై సిట్ ఆరా?

image

TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సిట్ విచారణ 4 గంటలుగా కొనసాగుతోంది. ఓ ఛానెల్ ఎండీ స్టేట్‌మెంట్ ఆధారంగా కేటీఆర్‌ను ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. 2023 ఎన్నికల సమయంలో బీఆర్ఎస్‌కు వచ్చిన విరాళాలపైనా సిట్ ఆరా తీస్తున్నట్లు సమాచారం. ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో ఎన్ని రూ.కోట్లు వచ్చాయనే వివరాలు అడిగినట్లు తెలుస్తోంది.