News March 12, 2025

పెద్దపల్లి జిల్లాలో భగ్గుమంటున్న భానుడు

image

వేసవి నేపథ్యంలో పెద్దపల్లి జిల్లాలో ఎండల తీవ్రత పెరుగుతోంది. బుధవారం ముత్తారం మండలంలో సరాసరి గరిష్ఠ ఉష్ణోగ్రత 37.6℃గా నమోదైందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. అటు చలి తీవ్రత కూడా తగ్గడంతో కాల్వ శ్రీరాంపూర్ మండలంలో 19.1℃ సరాసరి కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కాగా, ఇప్పటికే జిల్లా ప్రజలు ఉక్కుపోతతో ఇబ్బందులు పడుతున్నారు. మధ్యాహ్నం సమయంలో తీవ్రత మరింత ఎక్కువగా ఉంటోంది.

Similar News

News February 7, 2026

నిర్మల్: సీనియర్ లీడర్స్ ఫుల్ యాక్షన్ మోడ్!

image

నిర్మల్ మున్సిపల్ ఎన్నికల్లో సీనియర్ నాయకులు ప్రచార వేగాన్ని పెంచారు. వార్డు స్థాయిలో సమావేశాలు, కార్యకర్తలతో సమన్వయం, ఇంటింటి ప్రచారం ద్వారా అభ్యర్థుల విజయానికి కృషి చేస్తున్నారు. అభివృద్ధి అంశాలను ప్రస్తావిస్తూ ఓటర్ల మద్దతు కోరుతున్నారు. పార్టీ వర్గాలు ఈ ప్రచారం ఫలితాలపై సానుకూలంగా స్పందిస్తున్నాయి. అయితే స్థానిక సమస్యలు, ప్రత్యర్థుల వ్యూహాలు కూడా ఫలితాన్ని ప్రభావితం చేసే అవకాశం ఉంది.

News February 7, 2026

కొత్తకోట బరిలో భార్యాభర్తలు

image

వనపర్తి జిల్లా కొత్తకోట మున్సిపాలిటీలో ఎన్నికల రాజకీయం రసవత్తరంగా మారింది. మున్సిపల్ 10వ వార్డు నుంచి అడ్వకేట్ యాదగిరి పోటీ పడుతుండగా, 11వ వార్డు నుంచి ఆయన భార్య శ్రీలత బీఆర్ఎస్ తరఫున బరిలో నిలిచారు. మున్సిపల్ చైర్‌పర్సన్ స్థానం బీసీ మహిళకు రిజర్వ్ కావడంతో పదవిని దక్కించుకోవాలని శ్రీలత ముమ్మరంగా ప్రయత్నిస్తున్నారు. ఫిబ్రవరి 11న జరిగే పోలింగ్‌లో ఈ దంపతుల రాజకీయ భవిష్యత్తు తేలనుంది.

News February 7, 2026

‘హగ్స్, ఫొటో సెషన్స్ పని చేయలేదు’.. ట్రేడ్ డీల్‌పై కాంగ్రెస్ సెటైర్లు

image

అమెరికాతో చేసుకున్న వాణిజ్య ఒప్పందంపై కాంగ్రెస్ విమర్శలు గుప్పించింది. ‘ఇకపై రష్యా ఆయిల్‌ను ఇండియా కొనదు. కొంటే 25% పెనాల్టీ విధిస్తామని US హెచ్చరించింది. US రైతుల కోసం దిగుమతి సుంకాలను ఇండియా తగ్గిస్తుంది. అమెరికా ఎక్స్‌పోర్ట్స్ 3 రెట్లు పెరుగుతాయి. భారత వస్తువులపై ఎక్కువ సుంకాలు పడతాయి. హగ్స్, ఫొటో సెషన్స్ పెద్దగా పని చేయలేదు. హౌడీ మోదీపై నమస్తే ట్రంప్‌దే పైచేయి’ అని జైరామ్ రమేశ్ ట్వీట్ చేశారు.