News November 30, 2025

పెద్దపల్లి జిల్లాలో సర్పంచ్ నామినేషన్లు ఎన్నంటే..?

image

పెద్దపల్లి జిల్లా గ్రామపంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ నామినేషన్ల గడువు నిన్నటితో ముగిసింది. గడువు చివరి రోజు కావడంతో భారీగా దరఖాస్తులు సమర్పించారు. మొత్తం 99 గ్రామపంచాయతీలకు 823 నామినేషన్లు స్వీకరించారు. మండలాల వారీగా.. కమాన్ పూర్ 93, మంథని 270, ముత్తారం 128, రామగిరి 160, శ్రీరాంపూర్ 172 నామినేషన్లు దాఖలయ్యాయి. నామినేషన్ ప్రక్రియ శాంతియుతంగా పూర్తయిందని అధికారులు తెలిపారు.

Similar News

News February 18, 2026

కాకినాడ: దారుణం.. ఒంటిపై పెట్రోల్ పోసి..!

image

తునిలోని శ్రీరామ థియేటర్ సెంటర్‌లో బుధవారం దారుణ ఘటన చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. బైక్, సైకిల్ మెకానిక్స్ మధ్య జరిగిన గొడవ హింసాత్మకంగా మారింది. వాగ్వాదం తీవ్రం కావడంతో బైక్ మెకానిక్.. సైకిల్ మెకానిక్‌పై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. తీవ్రంగా గాయపడిన బాధితుడిని తుని ఏరియా ఆసుపత్రికి తరలించారు. నిందితుడు PSలో లొంగిపోగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News February 18, 2026

గుంటూరు: కాంట్రాక్టర్లపై క్రిమినల్ చర్యలకు కలెక్టర్ ఆదేశాలు

image

ఇళ్ల నిర్మాణాల్ని మధ్యలోనే ఆపేసిన కాంట్రాక్టర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని మంగళవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో గుంటూరు కలెక్టర్ తమీమ్ అన్సారీయా అధికారులను ఆదేశించారు. ఉగాది నాటికి జిల్లాలో 22,952 గృహాల లక్ష్యం పూర్తి చేసేందుకు ప్రత్యేక శ్రద్ధ వహించాలని స్పష్టం చేశారు. ఉపాధి హామీలో పనులు చేసుకోవచ్చన్నారు. బిల్లుల చెల్లింపు వెంటనే జరుగుతుందని లబ్ధిదారులకు అవగాహన కల్పించాలన్నారు.

News February 18, 2026

GNT: అంబటి రాంబాబుకు బెయిల్ మంజూరు

image

మాజీ మంత్రి అంబటి రాంబాబుకు గుంటూరు జిల్లా న్యాయస్థానం బుధవారం బెయిల్ మంజూరు చేసింది. సత్తెనపల్లిలో సంక్రాంతి సంబరాల్లో లాటరీ పెట్టి డబ్బులు వసూలు చేసినట్లు నమోదైన కేసులో ఈ తీర్పును వెలువరించింది. పోలీసుల కస్టడీ పిటిషన్‌ని న్యాయస్థానం డిస్మిస్ చేసింది. పోలీసులు మరో పీటీ వారెంట్ వేయకుంటే అంబటి మరికొద్ది గంటల్లో జైలు నుంచి విడుదలయ్యే అవకాశం ఉందని YCP నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.