News August 12, 2025
పెద్దపల్లి జిల్లాలో 1,75,736 మందికి మాత్రల పంపిణీ

జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవం సందర్భంగా పెద్దపల్లి ప్రగతినగర్ ZPHSలో DMHO డా. జి.అన్నా ప్రసన్న కుమారి అల్బెండజోల్ మాత్రల పంపిణీ ప్రారంభించారు. నులిపురుగులు పిల్లల ఆరోగ్యానికి హానికరం కాబట్టి పరిశుభ్రత, పాదరక్షలు, శుభ్రమైన ఆహారం, నీరు వాడాలని సూచించారు. జిల్లాలో 1-19 ఏళ్ల 1,97,070 మందికి మాత్రలు పంపిణీ చేయగా, సోమవారం 1,75,736 మందికి ఇచ్చారు. హాజరుకాని వారికి 18న ఇస్తారు.
Similar News
News March 15, 2026
అంగన్వాడీల్లో చిన్నారులకు పాలు

TG: పౌష్టికాహార లోపాన్ని నివారించడమే లక్ష్యంగా అంగన్వాడీల్లో చిన్నారులకు ఇకపై పాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఏప్రిల్ నుంచి 3-6 ఏళ్ల పిల్లలకు రోజూ 100ML ఇవ్వనుంది. రాష్ట్రంలోని 35,781 అంగన్వాడీల్లో 4.5L మంది పిల్లలు నమోదు చేసుకున్నారు. వీరికి పాలు ఇవ్వాలంటే రోజుకు 45 వేల లీటర్లు అవసరమని ప్రభుత్వం అంచనా వేస్తోంది. విజయ లేదా నందినీ డెయిరీ నుంచి మిల్క్ తీసుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.
News March 15, 2026
ఎండ తీవ్రతపై అప్రమత్తంగా ఉండాలి: VZM కలెక్టర్

రాబోయే రోజుల్లో ఎండ తీవ్రత, వడగాలులు పెరిగే అవకాశం ఉన్నందున ప్రజలు జాగ్రత్తలు పాటించాలని జిల్లా కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి శనివారం సూచించారు. ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎండలో ఎక్కువ సమయం పని చేయకుండా ఉండాలని, తరచుగా నీరు, మజ్జిగ, నిమ్మరసం వంటి ద్రవాలు తీసుకోవాలని చెప్పారు. వడదెబ్బకు గురైన వారిని వెంటనే నీడలోకి తీసుకెళ్లి చల్లబరచి అవసరమైతే సమీప ఆసుపత్రికి తరలించాలని సూచించారు.
News March 15, 2026
విద్యుత్ బిల్లులపై నకిలీ మెసేజ్‌లకు మోసపోవద్దు: శివశంకర్

విద్యుత్ బిల్లుల పేరుతో వినియోగదారులకు వస్తున్న నకిలీ సందేశాలను నమ్మవద్దని ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ శివశంకర్ లోతేటి సూచించారు. బిల్లు బకాయి ఉందని, వెంటనే చెల్లించకపోతే విద్యుత్ నిలిపివేస్తామని హెచ్చరిస్తూ కొందరికి నకిలీ మెసేజ్‌లు వస్తున్నట్లు తెలిపారు. ఇటువంటి సందేశాలను నమ్మి ఎవరూ మోసపోవద్దని కోరారు. విద్యుత్ సేవలకు సంబంధించిన సమాచారం అధికారిక మార్గాల్లోనే అందిస్తామని చెప్పారు.


