News August 12, 2025

పెద్దపల్లి జిల్లాలో 5.9 మి.మీ వర్షపాతం

image

పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా అవరేజ్‌గా 5.9 మి.మీ వర్షాపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. మండలాల వారీగా ఓదెలలో 22.4, శ్రీరాంపర్‌లో 11.0, ముత్తారంలో 17.3, మంథనిలో 9.1, ఎలిగేడులో 1.4, సుల్తానాబాద్‌లో 7.8, రామగుండంలో 3.8, రామగిరిలో 2.5, కమాన్‌పూర్‌లో 1.9, పెద్దపల్లిలో 3.3, పాలకుర్తిలో 0.8, అంతర్గాంలో 1.3, జూలపల్లి, ధర్మారంలో జీరో వర్షపాతం నమోదైంది.

Similar News

News March 15, 2026

కృష్ణా: గ్యాస్ బుకింగ్‌పై మార్గదర్శకాలు జారీ

image

కృష్ణా జిల్లాలో LPG సరఫరా క్రమబద్ధీకరణకు JC నవీన్ ఆదివారం కీలక ఆదేశాలు జారీ చేశారు. గృహ వినియోగదారులకు ఇబ్బంది లేకుండా ఒక సిలిండర్ బుక్ చేశాక, రెండో బుకింగ్‌కు పట్టణాల్లో 30 రోజులు, గ్రామీణ ప్రాంతాల్లో 45 రోజుల వ్యవధి ఉండాలని స్పష్టం చేశారు. గ్యాస్ సరఫరాలో అంతరాయం కలగకుండా ఈ నిబంధనలు అమలు చేయాలని అధికారులను ఆదేశించారు.

News March 15, 2026

22న రైతు భరోసా నిధులు

image

TG: రైతులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. ఈ నెల 22వ తేదీ రైతు భరోసా మొదటి విడత నిధులు ఇవ్వాలని నిర్ణయించింది. సిద్దిపేట(D) నర్మెట్టలో CM రేవంత్ రైతుల ఖాతాల్లో నిధులు జమ చేయనున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. మరోవైపు 20రోజుల తర్వాత రెండో విడత, APR నెలాఖరులోగా మూడో విడత నిధులు అందజేయనున్నారు. 3 విడ‌త‌ల్లో క‌లిపి రైతుల ఖాతాల్లో సుమారు రూ.9 వేల కోట్లు జమ కానున్నాయి.

News March 15, 2026

LSGకి బిగ్ షాక్?

image

ఈ నెలాఖరున ప్రారంభమయ్యే IPLలో LSG జట్టుకు కీలక ప్లేయర్ దూరం కానున్నట్లు క్రీడావర్గాలు తెలిపాయి. ఆ జట్టు స్టార్ ఆల్‌రౌండర్ వనిందు హసరంగా గాయం కారణంతో ఈ సీజన్ ఆడటం అనుమానమే అని అంటున్నాయి. తొడ కండరాల గాయం వల్ల T20WCలోనూ అతను ఆడలేదు. ఇప్పటికీ పూర్తిగా కోలుకోలేదని సమాచారం. ఈసారి వేలంలో ఇతడిని LSG రూ.2కోట్లకు సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. గత సీజన్లో హసరంగా RR తరఫున ఆడి 11 వికెట్లు తీశారు.